అపోహలు వద్దు! చర్మ సంరక్షణ ప్రతి ఒక్కరికీ అవసరమే..

చర్మ సంరక్షణ ప్రతి ఒక్కరికీ అవసరమే. కానీ, తమ చర్మ స్వభావానికి అనువైన స్కిన్‌కేర్ ఉత్పత్తులు మాత్రమే వాడాలి. కొందరు చర్మానికి రక్షణ అవసరమని తెలిసినా రకరకాల అనుమానాలు, అపోహల కారణంగా అక్కడే ఆగిపోతారు. అలాంటివాళ్లు తెలుసుకోవాల్సిన విషయాల గురించి వివరంగా చెబుతున్నారు సౌందర్య నిపుణురాలు జైస్వాల్.
- సన్‌స్క్రీన్ లోషన్ ఎండాకాలంలో మాత్రమే వాడాలేమో అనుకుంటారు చాలామంది. వర్ష కాలం, చలికాలంలో ఎండ, వేడి ఎక్కువగా ఉండవన్నది వారి అభిప్రాయం. అంతమాత్రాన వాతావరణంలో సూర్యరశ్మి ఉండక పోదు. ఏ కాలంలోనైనా ఇంట్లో నుంచి బయటికి వెళ్తున్నప్పుడు చర్మానికి సన్‌స్క్రీన్ లోషన్ రాసుకుంటేనే, యూవీ కిరణాల నుంచి రక్షణ లభిస్తుంది. దాంతో చర్మ క్యాన్సర్ వచ్చే ఆస్కారం ఉండదు.
- రోజూ మర్దనా చేసుకుంటేనే, చర్మం సురక్షితంగా ఉంటుందని అనుకుంటారు కొందరు. చర్మ రంధ్రాల్లోని నూనె పదార్థాలు, దుమ్ము తొలగించడానికి ఇది మంచి పద్ధతే. అలాగని రోజూ చేస్తే, చర్మంలో సహజంగా ఉండాల్సిన నూనెలు పూర్తిగా తొలగిపోయి చర్మం పొడిబారుతుంది. సహజంగానే చర్మం ఏరోజుకారోజు మృతకణాలను దూరం చేసుకుంటుంది. కాబట్టి, వారానికి ఒకసారి మర్దనా చాలు.
- మేకప్ వేసుకుంటే చర్మం పాడవుతుందన్న అపోహ ఈరోజుల్లో కూడా ఉంది. ప్రస్తుతం మార్కెట్లో రకరకాల ఆర్గానిక్ మేకప్ ప్రొడక్ట్స్ దొరుకుతున్నాయి. వాటివల్ల చర్మానికి ఎలాంటి హానీ జరుగదు. అయితే, మేకప్ తొలగించకుండా రాత్రంతా నిద్రపోతే మాత్రం మొటిమలు, ముడతలు మొదలైన సమస్యలు ఎదురవుతాయి.
- ఎటూ ఆయిలీ స్కిన్ ఉండటం వల్ల, చాలామంది తమకు మాయిశ్చరైజర్ అవసరం లేదని భావిస్తారు. అలాగే, క్రీములు రాసుకుంటే మొటిమలు వస్తాయన్న భ్రమలో ఉంటారు. జిడ్డు చర్మం ఉన్నవాళ్లు లైట్‌వెయిట్, జెల్ బేస్డ్ మాయిశ్చరైజర్లు వాడటం వల్ల చర్మం మృదువుగా, ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే, ఖరీదైన ఉత్పత్తులు మాత్రమే మంచి ఫలితాలను ఇస్తాయనుకోవడం సరికాదు. ధరతో సంబంధం లేకుండా, వాటిలో ఏఏ పదార్థాలు వాడుతున్నారన్నది తనిఖీ చేసుకుంటే సరిపోతుంది. మొదటి సారి, ప్రయోగాత్మకంగా కొద్ది మోతాదులో వాడి చూడాలి.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- skin
- skin cancer
- skin care
RELATED ARTICLES
తాజా వార్తలు
Allu Arjun | నా జీవితపు ఆనందానికి పుట్టినరోజు శుభాకాంక్షలు.. ముద్దుల కూతురు అర్హపై అల్లు అర్జున్ క్యూట్ పోస్ట్!
Diabetes | డయాబెటిస్, ఫ్యాటీ లివర్, గుండె జబ్బులు.. మూడింటికీ ఏంటి సంబంధం..?
Venky Atluri | నాని లేదా విజయ్ దేవరకొండ.. వెంకీ అట్లూరి నెక్స్ట్ మూవీ ఎవరితో అంటే…!
BJP MLA | ఏపీ కూటమీలో లుకలుకలు.. రాజీనామా ఆలోచనలో బీజేపీ ఎమ్మెల్యే
Tollywood | టాలీవుడ్లో మళ్లీ పైరసీ కలకలం.. ‘ఆకాశంలో ఒక తార’ సహా నాలుగు కొత్త సినిమాల లీక్!
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

