నరాలు దెబ్బతింటే..
మా అత్తగారి వయసు యాభై ఏండ్లు. కాళ్లూ చేతులు మంటపెడుతున్నాయని తరచూ బాధపడుతూ ఉంటుంది. డాక్టర్‌ను సంప్రదిస్తే ఆక్రోపరస్తీషియా అనే నరాల జబ్బుగా అనుమానించి, న్యూరాలజిస్ట్‌ను కలవమన్నారు
మా అత్తగారి వయసు యాభై ఏండ్లు. కాళ్లూ చేతులు మంటపెడుతున్నాయని తరచూ బాధపడుతూ ఉంటుంది. డాక్టర్‌ను సంప్రదిస్తే
ఆక్రోపరస్తీషియా అనే నరాల జబ్బుగా అనుమానించి, న్యూరాలజిస్ట్‌ను కలవమన్నారు. ఈ వ్యాధికి కారణాలు ఏమిటి? చికిత్స గురించి కూడా తెలుపగలరు. – ఓ సోదరి
జ: ఆక్రోపరస్తీషియా కారణంగా చాలామంది రోగులు చేతులు, కాళ్లలో తీవ్రమైన అసౌకర్యాన్ని ఎదుర్కొంటారు. కొన్నిసార్లు ఒక చేతిలో, మరికొన్నిసార్లు రెండు చేతులూ కాళ్లలోనూ మంటలు, తిమ్మిర్లు ఇబ్బంది పెడతాయి. ఎవరో సూదితో పొడుస్తున్నట్లు నొప్పిగా ఉంటుంది. ఒళ్లంతా పట్టేసినట్లు అసౌకర్యంగా అనిపిస్తుంది. శరీరభాగాల్లో తట్టుకోలేని నొప్పి ఇబ్బంది పెట్టవచ్చు. వెన్నెముక లేదా మెదడు దగ్గర నరం దెబ్బతిన్నప్పుడు ఈ సమస్య వస్తుంది. వ్యాధి తీవ్రత రోజురోజుకూ పెరగడంవల్ల మానసిక ఒత్తిడి, ఆందోళన అధికం అవుతాయి. దీంతో నిద్రలేమి సమస్య వస్తుంది. మధుమేహం, విటమిన్-బి12 లోపం, కార్పెల్ టన్నెల్ సిండ్రోమ్ మొదలైన సమస్యలు కూడా ఆక్రోపరస్తీషియాకు కారణాలు కావచ్చు.
చాలా అరుదుగా క్యాన్సర్లు, కీమోథెరపీ మందుల దుష్ప్రభావం వల్ల వచ్చే ఆస్కారం ఉంది. బిగుతైన బట్టలు, అసౌకర్యమైన చెప్పులు, కఠిన వ్యాయామాలు.. మొదలైనవి కూడా నరాల దగ్గర ఒత్తిడి పెంచుతాయి. నిపుణులను సంప్రదిస్తే లక్షణాలు, వాటి తీవ్రతను బట్టి మందులు ఇస్తారు. చాలామంది సొంతవైద్యం చేసుకుంటూ అప్పటికప్పుడు నొప్పి తగ్గితే చాలనుకుంటారు. ఇది చాలా తప్పు. దీనివల్ల రోగిలో క్యాన్సర్ లాంటి రుగ్మతలు ఉంటే.. ప్రాథమిక దశలోనే గుర్తించలేం.
– డాక్టర్ మోహన్‌కృష్ణ నరసింహ కుమార్ జొన్నలగడ్డ
సీనియర్ న్యూరాలజిస్ట్ యశోద హాస్పిటల్స్, సోమాజిగూడ
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- disease
- pain
- senior citizen
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

