సపోటా సీజన్ వచ్చేసింది. కమ్మని ఈ పండులో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇందులో పిండిపదార్థాలు పుష్కలంగా ఉంటాయి. దీంతో శరీరానికి శక్తినిచ్చే గ్లూకోజ్ లభిస్తుంది. ఇందులోని విటమిన్ ఎ కంటికి చాలా మంచిది. సపోటాలో ఆరోగ్యానికి మేలు చేసే నియాసిన్, కాపర్, ఐరన్ లాంటి మూలకాలు ఉంటాయి. సపోటాలో పుష్కలంగా ఉండే ఫైబర్ మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది. జలుబు, దగ్గు సమస్యలతో బాధపడేవారికి కూడా ఈ పండు సంజీవనిలా పనిచేస్తుంది. కిడ్నీల్లో ఏర్పడే రాళ్లను తొలగించడంలోనూ సపోటాకు సాటిలేదంటున్నారు వైద్య నిపుణులు. సపోటాలోని విటమిన్ బి, సి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఇందులోని కాల్షియం, పాస్పరస్ వల్ల ఎముకలు దృఢంగా తయారవుతాయి. గర్భిణులకు, పాలిచ్చే తల్లులకు కూడా సపోటా మంచి ఆహారం. రోజూ సపోటా జ్యూస్ తాగేవారికి జుట్టు ఒత్తుగా పెరగడంతోపాటు, జుట్టు రాలడం, చుండ్రు సమస్యలు కూడా తగ్గుతాయి. ఊబకాయం సమస్యలతో బాధపడేవారికీ ఈ ఫలం దివ్యౌషధంగా పనిచేస్తుంది.