ఇప్పుడంతా స్మార్ట్! ఇంట్లో అన్ని పరికరాలు రిమోట్ సాయంతో, సెన్సర్ సాయంతో పనిచేసేవి అందుబాటులోకి వచ్చేశాయి. ఏసీ, ఫ్యాన్, టీవీ, డోర్లతో సహా అన్నిటినీ కూర్చునే ఆపరేట్ చేయవచ్చు. అంతేకాదు కొన్నింటిని స్మార్ట్ ఫోన్ సాయంతో దూరంలో ఉన్నా ఆపరేట్ చేసే సదుపాయం ఉంది. అలెక్సా వంటి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో పనిచేసే ఉపకరణాలతో ఇంట్లోని అన్ని రకాల గృహోపకరణాలను స్మార్ట్‌గా పని చేయిస్తున్నప్పుడు పరదాలను జరపడం కోసం ఎందుకు కష్టపడాలి? అందుకే స్మార్ట్ యుగానికి అనుగుణంగా రిమోట్‌తో ఆపరేట్ చేయగలిగే పరదాలను పలు సంస్థలు తీసుకొచ్చాయి.
వీటిని మోటరైజ్డ్ కర్టెన్లు అంటారు. కూర్చున్న చోటనే ఉండి రిమోట్ సాయంతో డోర్ కర్టెన్లు మూయవచ్చు. తెరవవచ్చు. ఈ స్మార్ట్ కర్టెన్లను ఫోన్‌తో కూడా ఆపరేట్ చేయవచ్చు. ఇవి చేతితో తాకినా తెరుచుకుంటాయి. ఈ మోటరైజ్డ్ కర్టెన్లు ఆన్లైన్లో అమ్మకానికి ఉన్నాయి. పలు సంస్థలు ఈ స్మార్ట్ కర్టెన్లను కస్టమైజ్డ్గా కూడా తయారు చేస్తున్నాయి. అంటే వినియోగదారుడు కోరిన డిజైన్, రంగు, కొలతలతో తయారు చేసి ఇస్తారన్నమాట!