రెడ్ క్రాస్ సంస్థ మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలిగా ఎగ్గర్

Red Cross elects Mirjana Spoljaric Egger as first female president | ప్రపంచ ప్రసిద్ధ మానవతావాద సంస్థ ‘ అంతర్జాతీయ రెడ్ క్రాస్ ‘ పగ్గాలు తొలిసారిగా ఓ మహిళ చేతికి రానున్నాయి. రెడ్ క్రాస్ తర్వాతి అధ్యక్షురాలిగా స్విట్జర్లాండ్ దౌత్యవేత్త మిర్జానా స్పొల్జారిక్ ఎగ్గర్ను నియమించినట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఎగ్గర్ ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్డీపీ) అసిస్టెంట్ సెక్రటరీ జనరల్‌గా పనిచేస్తున్నారు. రెడ్ క్రాస్ ప్రస్తుత అధ్యక్షుడు పీటర్ మారర్ పదవీకాలం వచ్చే సెప్టెంబర్‌తో ముగుస్తుంది. ఆయన స్థానాన్ని ఎగ్గర్ భర్తీ చేయనున్నారు. తన నియామకం గురించి ఎగ్గర్… ‘రెడ్ క్రాస్ అధ్యక్షురాలిగా ఎంపికవడం చాలా గొప్ప గౌరవం. గొప్ప బాధ్యత. ఈ మలుపు కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నాను’ అని ఉత్సాహంగా చెబుతున్నారు. అణగారిన ప్రజల అవసరాలను వెలుగులోకి తెచ్చేందుకు తాను కట్టుబడి ఉన్నానని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా సంక్షోభ వాతావరణంలో పనిచేస్తున్న రెడ్ క్రాస్ బృందాల కృషికి సార్థకత చేకూరుస్తానని హామీ ఇచ్చారు. ఇంతవరకు ఎగ్గర్ ఐక్యరాజ్య సమితిలో, స్విట్జర్లాండ్ విదేశాంగ శాఖలో వివిధ హోదాల్లో సేవలు అందించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
ఎక్కడ మైక్ పెట్టినా హలో హలో మైక్ టెస్టింగ్ అంటుండె.. అది చూసి పాట పాడిస్తుండె
వజ్రాల వ్యాపారం చేస్తున్న ఏకైక మహిళ రాధిక మన్నె.. ఎవరామె.. ఆమె సక్సెస్ సీక్రెట్ ఏంటి?
custard apple | సీతాఫలాలతో ఐస్‌క్రీమ్‌లు తయారు చేస్తున్న పాలమూరు మహిళలు..
jai bhim | ఈమెదీ చినతల్లి లాంటి కథే.. కానీ న్యాయం ఇంకా జరగలేదు !
నీకు సినిమాలు అవసరమా? నువ్వేం చేయగలవు? అని హేళన చేశారు.. కానీ..
మీ పెంపుడు జంతువులు..ఇక తప్పిపోవు!
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

