దోమలు పరార్!
వర్షాకాలం మొదలు కాబోతున్నది. వర్షాలతోపాటే దోమల బెడద పెరగనున్నది. వాటితో వ్యాధుల ముప్పు కూడా రాబోతున్నది. ఈ క్రమంలో బాల్కనీ, టెర్రస్పై కొన్నిరకాల మొక్కలను పెంచుకుంటే.. దోమలతో ఇబ్బంది తప్పుతుంది.
వర్షాకాలం మొదలు కాబోతున్నది. వర్షాలతోపాటే దోమల బెడద పెరగనున్నది. వాటితో వ్యాధుల ముప్పు కూడా రాబోతున్నది. ఈ క్రమంలో బాల్కనీ, టెర్రస్పై కొన్నిరకాల మొక్కలను పెంచుకుంటే.. దోమలతో ఇబ్బంది తప్పుతుంది.
వేప: ఎన్నో ఔషధ గుణాలు కలిగిన వేప.. సహజసిద్ధమైన పురుగుమందుగా పనిచేస్తుంది. ఇప్పటికీ ఊళ్లలో దోమలు, క్రిమికీటకాలను తరిమేసేందుకు వేపాకులను కాల్చి.. పొగ
బెడుతుంటారు. వేపనూనెతోనూ దోమలను తరిమికొట్టొచ్చు. కాబట్టి, మీ పెరటి తోటలో ఓ వేప మొక్కను నాటండి. ఇప్పుడు ‘బోన్సాయ్’ రూపంలోనూ వేప చెట్లు పెరుగుతున్నాయి. వాటిని బాల్కనీలో పెంచుకోండి.
లావెండర్: ఈ మొక్కల వాసన చాలా ఘాటుగా ఉంటుంది. దోమలను తరిమేస్తుంది. ఇంటి గుమ్మం, కిటికీల దగ్గర లావెండర్ మొక్కలను పెంచితే.. ఇంటికి కొత్త అందం రావడంతోపాటు దోమల బాధ కూడా తప్పుతుంది.
తులసి: వీటి ఆకుల నుంచి సుగంధమైన, ఘాటు వాసనలు వస్తాయి. ఇవి మనిషికి ఆరోగ్యాన్ని అందిస్తే.. దోమలకు అసహ్యంగా ఉంటాయి. అందుకే.. తులసి మొక్క ఉన్నచోట దోమలు వృద్ధిచెందవు. ఓ తులసి మొక్క పెంచడం వల్ల.. ఇల్లు మొత్తం ఔషధ గుణాలతో కూడిన గాలి వ్యాపిస్తుంది. ఆరోగ్యానికీ మేలుచేస్తుంది.
బంతి మొక్క: ఈ మొక్క నుంచి వచ్చే ఘాటు వాసనలు కూడా.. దోమల నిరోధకంగా పనిచేస్తాయి. దోమల మందుల్లోనూ బంతిపూల తైలాలను వాడతారు. అందుకే ఇంట్లో బంతి మొక్క పెంచడం చాలా ఉపయోగకరం.
నిమ్మగడ్డి: దోమలను తరిమికొట్టడంలో నిమ్మగడ్డి అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే ‘సిట్రోనెల్ల ఆయిల్’.. దోమల నివారణలో ముందుంటుంది. అందుకే.. దోమల మందుల్లోనూ ఈ నూనెను వాడుతారు. ఈ మొక్క ఆకులను కొద్దిగా నూరి.. ఆ వాసన ఇంట్లో వ్యాపించేలా చేస్తే.. దోమలు పారిపోతాయి.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- mosquito
- plants
- rainy season
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | పిల్లలకు ఇంటర్నెట్పై నిషేధం తగదు.. కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
FSSAI | బిస్కెట్లలో దాణా.. పాలల్లో డిటర్జెంట్.. మూడు కంపెనీలపై ఎఫ్ఎస్ఎస్ఏఐ కేసులు
Uttarakhand | సీఎం సార్..నా భార్య అవినీతి లెక్క తేల్చండి..! ఉత్తరాఖండ్ మహిళా మంత్రిపై భర్త ఆరోపణలు
RTC Elections | ఆర్టీసీ ఎన్నికల ఫలితాలు తారుమారు?.. కాంగ్రెస్ అనుబంధ సంఘానికి కట్టబెట్టే యత్నం
Delhi Police | పోలీసుల దాష్టీకాలపై కదం తొక్కిన మహిళలు.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

