ఆండ్రాయిడ్ యూజర్లకు ప్లే స్టోర్ ఓ యాప్ భాండాగారమే అనొచ్చు. ఎందుకంటే అవసరానికి తగ్గ యాప్ అక్కడ దొరికిపోతుంది. ఎంచక్కా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అక్కర్లేని యాప్స్‌ని క్షణాల్లో అన్ ఇన్స్టాల్ చేసేయొచ్చు. ఆండ్రాయిడ్ ఫోన్లను ఎక్కువగా వాడటానికి ప్లే స్టోర్‌లో కావాల్సినన్ని యాప్స్ ఉండటమే కారణమని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో యూజర్లు మరింత అనువుగా వాడుకునేలా ప్లే స్టోర్‌లో సరికొత్త ఫీచర్స్‌ను గూగుల్ తీసుకొస్తున్నది. వాటిల్లో ఒకటి ‘స్మార్ట్ రెజ్యూమ్’. ఇది మీ డేటాను ఆదా చేస్తుంది. ఎందుకంటే చాలామంది యూజర్లు లిమిటెడ్ డేటా ప్లాన్‌తోనే నెట్టుకొస్తుంటారు. యాప్స్ ఇన్స్టాల్ చేసే క్రమంలో డేటా వృథాకాకుండా ‘స్మార్ట్ రెజ్యూమ్’ ఆప్షన్ ఉపయోగపడుతుంది. ఇదెలా పనిచేస్తుందంటే.. ఏదైనా యాప్ ఇన్స్టాల్ చేసేటప్పుడు కొన్నిసార్లు ఫోన్ స్టక్ అవుతుంటుంది. మళ్లీ డేటా రీసెట్ కాగానే యాప్ ఇన్స్టాలేషన్ మొదట్నుంచీ కంటిన్యూ అవుతుంది. దీంతో డేటా బ్యాలెన్స్ కరిగిపోతుంది. అలాగే సమయం కూడా వృథా అవుతుంది. ఇలాంటి సమయంలో స్మార్ట్ రెజ్యూమ్‌తో మేనేజ్ చేయొచ్చు. ఆగినో చోటు నుంచే మళ్లీ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అయితే, ఈ ఫీచర్‌ని వాడుకోవాలంటే.. 5జీబీ స్పేస్ కేటాయించాల్సి ఉంటుంది. అలాగే, గేమ్స్ కంట్రోల్స్‌ని కూడా మరింత స్మార్ట్‌గా మర్చేస్తూ
‘రెజ్యూమ్ ప్లేయింగ్’ ఫీచర్‌ని పరిచయం చేయనుంది. దీంతో గేమ్‌ని ఆపిన చోటు నుంచే స్టార్ట్ చేయొచ్చు.