ప్రముఖ స్మార్ట్‌ఫోన్ ఉత్పత్తుల సంస్థ వన్‌ప్లస్.. తన ఫ్లాగ్షిప్ లైనప్‌లో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయడానికి సిద్ధమవుతున్నది. వన్‌ప్లస్ 15, వన్‌ప్లస్ 15ఆర్ పేరుతో రెండు ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకురానున్నది. యువతరానికి నచ్చేలా.. అదిరిపోయే ఫీచర్లతో వీటికి రూపకల్పన చేసింది. ఈ ఫోన్ల ప్రత్యేకతల విషయానికి వస్తే.. వీటిలో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్-8 ఎలైట్ జెన్-5 ప్రాసెసర్‌ను వాడారు. 6.7 అంగుళాల 1.5కె రిజల్యూషన్ డిస్ప్లేతో ఇవి వస్తున్నాయి. 165హెట్జ్ రిఫ్రెష్ రేట్‌తో స్మూత్‌గా పనిచేస్తాయి. 12జీబీ/ 16జీబీ ర్యామ్ ఉండటం వల్ల.. మల్టిపుల్ అప్లికేషన్స్‌ను ఎలాంటి ల్యాగ్ లేకుండా వాడుకోవచ్చు.
సెక్యూరిటీ కోసం అల్ట్రాసోనిక్ ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ కూడా ఉండబోతున్నది. రెండు మోడల్స్‌లోనూ 7500 ఎంఏహెచ్ భారీ బ్యాటరీతోపాటు 100 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్టునూ అందిస్తున్నారు. ఫొటోగ్రఫీని ఇష్టపడేవారి కోసం ట్రిపుల్ 50 ఎంపీ కెమెరా సిస్టమ్‌ను ఏర్పాటుచేశారు. ప్రైమరీ షూటర్, అల్ట్రా-వైడ్ లెన్స్, 3ఎక్స్ ఆప్టికల్ జూమ్‌తో టెలిఫొటో సెన్సర్లు ఉన్నాయి. ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్‌తో ఎలాంటి ఇబ్బంది లేకుండా వాడుకోవచ్చు. ఈ రెండు మోడల్స్ కూడా వచ్చే నెలలో మార్కెట్లోకి విడుదల కానున్నట్లు సంస్థ ప్రకటించింది. ధర విషయానికి వస్తే.. వన్‌ప్లస్ 15ఆర్ మోడల్ రూ.44,999 వరకు, వన్‌ప్లస్ 15 స్టోరేజ్ వేరియంట్‌ను బట్టి రూ.65వేల నుంచి రూ.75వేల వరకూ ఉండే అవకాశం ఉన్నది.