రమ్య.. హ్యాండ్లూమ్ ఆంత్రప్రెన్యూర్, ఫ్యాబ్రిక్ డిజైనర్. ‘నారాయణి వీవ్స్’ పేరుతో ఆమె స్థాపించిన చేనేత వస్ర్తాలయాలు బెంగళూరు, హోస్పేట్లలో విజయవంతంగా నడుస్తున్నాయి. చీరలకు జమ్దానీ ఖాదీ ఆర్ట్‌వర్క్ జోడించి.. కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. తాజాగా ఆమె హైదరాబాద్‌లోని సప్త పర్ణిలో జరిగిన ఓ ప్రదర్శనలో ‘సాక్రెడ్ లోటస్’ పేరుతో చీరల కలెక్షన్ తీసు కొచ్చారు. దాన్ని తన తల్లి పద్మకు అంకితమిచ్చారు.
‘మా అమ్మ మనసులానే ఆ వస్త్రాలు సుతిమెత్తగా ఉంటాయి. మా అమ్మ ఒడిలానే వెచ్చదనాన్నీ ప్రసాదిస్తాయి. ఆ చీరల్ని కట్టుకుంటే.. తల్లి ఒడిలో సేదదీరుతున్న భావన కలుగుతుంది. అమ్మా.. ఈ చీరల్ని నీ పాద పద్మాలకు అంకితం చేస్తున్నా!’ అంటూ తన తల్లికి నివాళి అర్పించారు రమ్య.