సినిమాల్లోకి ఎంట్రీపై విశ్వసుందరి హర్నాజ్ కౌర్ రెస్పాన్స్ ఇది..
Miss Universe Harnaaz Kaur Sandhu | అందమైన కలను సాకారం చేసుకున్నది ‘విశ్వ సుందరి’ హర్నాజ్ కౌర్. రెండు దశాబ్దాల తర్వాత, విశ్వ సౌందర్య కిరీటం మరోసారి భారతీయులను వరించింది. విశ్వసుందరిగా తన బాధ్యతలు, సినిమా అవకాశాల గురించి హర్నాజ్ ముచ్చట్లు..
‘మిస్ యూనివర్స్’ టైటిల్ గెలిచిన తర్వాత నాలో చాలా మార్పు వచ్చింది. ఎన్నో నేర్చుకున్నాను. ఎంతోమంది అద్భుతమైన వ్యక్తుల్ని కలిశాను. సేవా సంస్థల్ని సందర్శించాను. ఎయిడ్స్ బాధితులను, గ్రహణ మొర్రి పీడితులను పరామర్శించాను. ప్రత్యేక అతిథి హోదాలో న్యూయార్క్ ఫ్యాషన్ వీక్‌లో పాల్గొన్నాను.
కలలను సాకారం చేసుకోవాలంటే సాహసం చేయాల్సిందే. నేను పదిహేడేండ్ల వయసులో మోడలింగ్‌లో అడుగుపెట్టాను. ఇలా విశ్వ సుందరి కిరీటం గెలుచుకుంటానని ఎప్పుడూ ఊహించలేదు. అందాల వేదికలు ఎక్కినప్పుడే నా అంతర్గత ప్రతిభ గురించి నాకు తెలిసొచ్చింది.

విజయం సాధించాలంటే వైఫల్యాలను ధైర్యంగా ఎదుర్కోవాలి. ఎవరి జీవితం వాళ్ల చేతుల్లోనే ఉంటుంది. ఒకసారి కింద పడిపోయినంత మాత్రాన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు. విజయావకాశాల్ని సందేహించకూడదు. అవసరమైతేఇతరుల సహాయమూ తీసుకోవచ్చు.
అందాల కిరీటం గెలువకముందే పంజాబీ సినిమాల్లో నటించాను. ఇప్పుడు బాలీవుడ్లో నటించాలని ఉంది. మిగతా భాషల్లోనూ తప్పకుండా చేస్తాను. సినిమాల కంటే ముందు విశ్వ సుందరిగా నేను నిర్వర్తించాల్సిన బాధ్యతలు కొన్ని ఉన్నాయి. అందుకు సరిపడా శక్తిని ఇవ్వమని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.
Read More :
“Manasa Varanasi | ప్రపంచ సుందరి కాలేకపోయినా.. మనసు మాత్రం బంగారం”
“9999 మేకులపై 9 నిమిషాలు నాట్యం చేసిన లిఖిత.. ఎలా సాధ్యమైందంటే..”
Akanksha Sharma | ఐకియాలో ఉన్న ఒకే ఒక్క భారతీయ డిజైనర్ ఈమెనే.. తన గురించి ఈ విషయాలు తెలుసా”
“Akanksha Sharma | ఐకియాలో ఉన్న ఒకే ఒక్క భారతీయ డిజైనర్ ఈమెనే.. తన గురించి ఈ విషయాలు తెలుసా”
“Rajyalaxmi | పీహెచ్డీ చేసిన తొలి సంచార జాతి మహిళ ఈమెనే..”
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మోరంపల్లిబంజర్‌లో ముమ్మరంగా పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
ధనవంతుడైన వ్యాపారవేత్తగా నటించి.. 20 మంది మహిళా కానిస్టేబుల్స్‌ను మోసగించిన వ్యక్తి
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

