ఆదివారం 25 అక్టోబర్ 2020
Zindagi - Aug 21, 2020 , 19:37:50

ఇంట్లో సీతాకోక చిలుక పెయింటింగ్‌ ఉండొచ్చా! ఉంటే అరిష్ట‌మా?

ఇంట్లో సీతాకోక చిలుక పెయింటింగ్‌ ఉండొచ్చా! ఉంటే అరిష్ట‌మా?

షాపింగ్‌మాల్, సూప‌ర్‌మార్కెట్‌కు వెళ్లిన‌ప్పుడు క‌నిపించే కొన్ని బొమ్మ‌లు, పెయింటింగ్‌లు మ‌నుషుల‌ను ఆక‌ర్షిస్తాయి. అవి ఇంట్లో ఉంటే బాగుంటుంద‌ని వెంట‌నే కొని హాల్లో అలంక‌రించేస్తాం. ఇంటికి వ‌చ్చిన బంధువులు, ఫ్రెండ్స్ వాటిని చూసి భ‌లే ఉన్నాయి. బాగా అలంక‌రించారు అని చెప్ప‌గానే మురిసిపోతాం. మ‌రి ఆ బొమ్మ‌లు ఇంట్లో పెట్టుకోవ‌డం వ‌ల్ల మంచిదేనా. వాటివ‌ల్ల  ఏమైనా అన‌ర్థం జ‌రుగుతుందా అని కొంత‌మంది సందేహం. ముఖ్యంగా గోడ‌కు పెట్టుకునే సీతాకోకచిలుక‌ల బొమ్మ‌లు, పెయింటింగ్స్ ప్ర‌తిఒక్క‌రి ఇంట్లో ఉంటాయి. వాటివ‌ల్ల ఏం జ‌రుగుతుందో ఇప్పుడు తెలుసుకోండి.

* రంగురంగుల సీతాకోక‌చిలుక‌లు మార్పుకు సంకేతాలు. 

* సీతాకోక చిలుక‌ల‌ను చూసిన‌ప‌పుడు ఎప్ప‌టినుంచో ఎదురు చూస్తున్న ల‌క్ష్యాన్ని సాధించిన ఫీలింగ్ క‌లుగుతుంది.

* అందుకే సీతాకోక‌చిలుక‌లు ఉన్న పెయింటింగ్స్ ఎక్కువ‌రేటు ఉన్న‌ప్ప‌టికీ వాటిని కోనుగోలు చేస్తారు.

* ఈ పెయింటింగ్‌ను తూర్పు లేదా నార్త్ఈస్ట్ మ‌ధ్య ప్ర‌దేశంలో పెడితే మంచి జ‌రుగుతుంది.

* ఈశాన్యం మూల‌లో బ‌ట‌ర్‌ఫ్లై పెయింటింగ్ పెడితే పాజిటివ్ ఎన‌ర్జీని పొంద‌వ‌చ్చు.

* ఈ ప్ర‌దేశంలో పెడితే వాస్తు బాగుంద‌ని చెబుతుంటారు జ్యోతిష్యులు.

* ఇంట్లో ఉన్న నెగ‌టివ్‌ను పోగొట్ట‌డానికి ఇది ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది. మ‌రి ఇంకెందుకు ఈ పెయింటింగ్స్ మీద ఉన్న అపోహ‌ల‌న్నీ తొలిగిపోయిన‌ట్లే క‌దా. దీనివ‌ల్ల మంచే కాని చెడు ఏమాత్రం జ‌ర‌గ‌దు.  


logo