బాలీవుడ్ సెలెబ్రిటీ, ఫిట్నెస్ క్వీన్ మలైకా అరోరా కొత్తగా ఫుడ్ బిజినెస్‌లోకి
అడుగుపెట్టింది. ‘న్యూడ్ బౌల్స్’ పేరుతో సెలెబ్రెటీల పోషకాహారాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ రుచులను ‘న్యూడ్ బౌల్స్’ యాప్ ద్వారా ఆర్గానిక్ ప్యాకింగ్‌తో వినియోగదారులకు చేరవేస్తున్నది. తనకంటూ ఓ సొంత రెస్టారెంట్ ఉండాలనుకున్న మలైకా.. తాజా వ్యాపారంతో ఆ కోరికను నెరవేర్చుకున్నది. ‘న్యూడ్ అంటే మీరు ఏదేదో ఊహించేసుకోకండి. న్యూట్రిషన్ విలువలు కలిగిన రుచికరమైన ఆహారాన్ని తినడం.. అనే అర్థం వచ్చేలా ఈ పేరు ప్రతిపాదించాం’ అంటున్నది మలైకా. ఈ యాప్‌లో తక్కువ ధరకే పోషకాహారాన్ని పొందవచ్చని చెబుతున్నది. కనీస ధరను రూ.199గా నిర్ణయించింది. కస్టమర్లు నచ్చిన ఫుడ్‌ను క్లిక్ చేయగానే.. అందులోని పోషకాల వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. ప్రస్తుతం ముంబై, పుణె, ఢిల్లీ, బెంగళూర్ నగరాల్లో అందుబాటులో ఉన్న ‘న్యూడ్ బౌల్స్’ సేవలను త్వరలోనే మరిన్ని నగరాలకు విస్తరించనుంది మలైకా.