జియో హాట్‌స్టార్: స్ట్రీమింగ్ అవుతున్నది
తారాగణం: విక్రాంత్, నియతి కదంబి, థేని మురుగన్, సింధు శ్యామ్, హరీష్, అయాజ్ ఖాన్, విశ్వమిత్రన్ తదితరులు
దర్శకత్వం: గణేష్ కార్తికేయన్
మనదేశంలో ఎక్కువమంది ఇష్టపడేవాటిలో.. ఆటలు, సినిమాలు ముందువరుసలో ఉంటాయి. అందులోనూ క్రికెట్, ప్రేమ కథలు అగ్రస్థానంలో నిలుచుంటాయి. ఈ రెండిటినీ మేళవిస్తూ.. ఇప్పటికే పలు సినిమాలు వెండితెరపై సందడిచేశాయి. నిర్మాతలకు కాసుల వర్షం కురిపించాయి. అదే ఫార్ములాను ఫాలో అయిపోతూ.. ‘ఎల్బీడబ్ల్యూ : లవ్ బియాండ్ వికెట్’ వెబ్‌సిరీస్ రూపొందింది. ఓటీటీ ఆడియన్స్‌కు న్యూఇయర్ వెల్కమ్ చెబుతూ.. ‘జియో హాట్‌స్టార్’ వేదికగా స్ట్రీమింగ్కు వచ్చింది. ఈ తమిళ స్పోర్ట్స్ డ్రామా సిరీస్.. తెలుగులోనూ రికార్డ్ వ్యూస్ కొల్లగొడుతున్నది. కథలోకి వెళ్తే.. రంగన్ (విక్రాంత్) ట్యాలెంటెడ్ క్రికెటర్. ఎప్పటికైనా టీమ్ ఇండియాకు ఆడాలని, ఓ మంచి క్రికెటర్‌గా దేశానికి గొప్పపేరు తేవాలని కలలు కంటాడు. మైదానంలో అద్భుతమైన నైపుణ్యాలు చూపుతూ.. భవిష్యత్ స్టార్లా కనిపిస్తాడు.
కానీ, కొన్ని కారణాలతో తన కలలను నెరవేర్చుకోలేక పోతాడు. అనుకోని సంఘటనలను అతణ్ని వెనక్కి లాగి.. క్రికెట్ కెరీర్‌కే పుల్‌స్టాప్ పడేలా చేస్తాయి. అయితే, క్రికెటర్‌గా తాను అనుకున్న స్థాయికి చేరలేకపోయాననే బాధలో ఉంటాడు రంగన్. ఆ సమయంలోనే ముత్తునగర్ అనే క్రికెట్ టీమ్‌కు కోచ్‌గా పనిచేసే అవకాశం అందుకుంటాడు. కానీ, రంగన్ వెళ్లేసరికి ఆ టీమ్ చాలా అధ్వానంగా ఉంటుంది. ఎవరికీ క్రమశిక్షణ, ఓ లక్ష్యం అంటూ ఉండదు. మరి క్రికెట్‌పై అవ్యాజమైన ప్రేమ ఉన్న రంగన్.. ముత్తునగర్ టీమ్‌ను ఎలా మార్చాడు? మధ్యలో వచ్చే ప్రేమ కథ ఎలా సాగుతుంది? ఈ క్రమంలో రంగన్ జీవితంలో ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? అనేది ఎల్బీడబ్ల్యూ సిరీస్‌లో చూడాల్సిందే!