మార్కెట్లోకి మరో ప్రీమియం స్మార్ట్‌వాచీ వచ్చేసింది. అమెరికాకు చెందిన కొరోస్ స్పోర్ట్స్ టెక్నాలజీస్.. ‘కొరోస్ పేస్ 4’ పేరుతో ఆధునిక స్మార్ట్‌వాచీని విడుదల చేసింది. తన పాత వెర్షన్ ‘కొరోస్ పేస్3’ని అప్‌గ్రేడ్ చేస్తూ.. కొత్త వాచీకి రూపకల్పన చేసింది. ‘కొరోస్ పేస్ 4’లో బడ్జెట్లోనే ప్రీమియం ఫీచర్లను అందిస్తున్నది. ఇందులో 1.23 అంగుళాల AMOLED టచ్‌స్క్రీన్ డిస్ప్లేను ఏర్పాటుచేశారు. ఎండలోనూ స్పష్టంగా కనిపించేలా హైరిజల్యూషన్‌తో దీనిని రూపొందించారు. కొత్తగా మరో యాక్షన్ బటన్‌తోపాటు ట్రెయినింగ్ లాగ్స్, వాయిస్ పిన్స్‌ను రికార్డ్ చేయడానికి మైక్రోఫోన్‌ను కూడా జోడించారు. దీని బరువు కేవలం 40 గ్రాములు మాత్రమే! చేతికి ధరించినట్లే అనిపించదు. వ్యాయామం చేసేటప్పుడు చాలా సౌకర్యంగా ఉంటుంది.
రోజువారీ కార్యకలాపాల కోసం.. హెల్త్ ట్రాకింగ్, స్లీప్ ట్రాకింగ్, విడ్జెట్స్ లాంటి మరిన్ని ఫీచర్లు ఉన్నాయి. మహిళల కోసం పీరియడ్ ట్రాకింగ్నూ అందిస్తుంది. బ్లూటూత్, వైఫై ద్వారా స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ అవుతుంది. కొరోస్ యాప్ నుంచి స్మార్ట్‌వాచీని యాక్సెస్ చేయొచ్చు. హెల్త్ రికార్డ్ మొత్తాన్నీ స్మార్ట్‌ఫోన్ ద్వారా చూసుకోవచ్చు. ఈ వాచీకి 5 ఏటీఎం వాటర్ రెసిస్టెన్స్ ఉండటం వల్ల.. వర్కవుట్స్‌లో చెమట పట్టినా, వర్షంలో తడిసినా ఏమీకాదు. ఇక -20 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 50 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకూ.. ఎలాంటి ఉష్ణోగ్రతలనైనా తట్టుకుంటుంది. ఎంతటి కఠినమైన వాతావరణంలోనైనా చక్కగా పనిచేస్తుంది. రోజువారీ హెల్త్ ట్రాకింగ్ చేస్తూనే.. 19 రోజుల వరకూ బ్యాటరీ బ్యాకప్‌ని అందిస్తుంది. కేవలం 2 గంటల్లోనే పూర్తిగా చార్జ్ అవుతుంది.
ఇందులోని మరో అద్భుతమైన ఫీచర్.. 4 జీబీ ఇంటర్నల్ మెమొరీ. కావాల్సినన్ని యాప్స్, వాచ్ ఫేసెస్ను ఇన్స్టాల్ చేసుకొనే అవకాశం ఉంటుంది. ఇక నావిగేషన్ కోసం జీపీఎస్, గ్లోనాస్, గెలీలియో లాంటి సాటిలైట్ సిస్టమ్స్‌ను సపోర్ట్ చేస్తుంది. కొత్తగా ఏర్పాటైన ఆప్టికల్ హార్ట్‌రేట్ మానిటర్.. హృదయ స్పందనలను మరింత స్పష్టంగా రికార్డ్ చేస్తుంది. బారోమెట్రిక్ ఆల్టీమీటర్, ఆప్టికల్ పల్స్ ఆక్సీమీటర్, యాక్సిలెరోమీటర్, గైరోస్కోప్, 3డీ కంపాస్, థర్మామీటర్ లాంటి అదనపు ఫీచర్లూ ఉన్నాయి. గోప్రో, డీజేఐ, ఇన్‌స్టా 360 లాంటి యాక్షన్ కెమెరాలకు రిమోట్గానూ పనిచేస్తుంది. ఇంగ్లిష్‌తోపాటు చైనీస్, జర్మన్, స్పానిష్, ఫ్రెంచ్, పోలిష్, థాయ్, జపనీస్, కొరియన్, పోర్చుగీస్, ఇటాలియన్, రష్యన్ లాంటి అనేక భాషలను సపోర్ట్ చేస్తుంది. అత్యాధునిక ఫీచర్లతో, ప్రీమియం క్వాలిటీతో వచ్చిన ఈ ‘కొరోస్ పేస్ 4’ ధర రూ.22,000. కొరోస్ అధికారిక వెబ్‌సైట్‌తోపాటు అన్ని ప్రముఖ ఆన్లైన్, ఆఫ్‌లైన్ స్టోర్లలో అందుబాటులో ఉన్నది.