Kajal aggarwal | టాలీవుడ్ నటి కాజల్ అగర్వాల్ తల్లి కాబోతున్నదనే వార్త షికార్లు చేస్తున్నది. అయితే, ఆమె మాత్రం ‘దీని గురించి నేనిప్పుడే ఏమీ చెప్పలేను. సరైన సమయం వచ్చినప్పుడు స్పష్టం చేస్తా’ అని తప్పించుకుంటున్నది.
గత నెలలో కాజల్, గౌతమ్ జంట మొదటి వివాహ వార్షికోత్సవం జరుపుకొన్నది. కాజల్ సోదరి నిషా ఇప్పటికే ఇద్దరు పిల్లల తల్లి. ‘నా చెల్లెలు తల్లి అయ్యాక ఎంత పరిపూర్ణత్వాన్ని అనుభవిస్తున్నదో కండ్లారా చూశాను. మాతృత్వం ఓ అద్భుతమైన అనుభూతి. ఆ దశలో ప్రతి స్త్రీ తనను తాను తెలుసుకుంటుంది. చెల్లి పిల్లలు ఇషాన్, కబీర్ సాన్నిహిత్యంలో నేను ఇప్పటికే మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్నా. పెంపుడు కుక్క మియా కూడా మాకు బిడ్డలాంటిదే. సొంత పిల్లలతో ఆ అనుభూతి రెట్టింపు కావచ్చు’ అంటున్నది కాజల్.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్న హీరోయిన్లు వీళ్లే..
వాటిని చూస్తే కాజల్, తమన్నా, ఇలియానాకు భయమట .. ఏంటవి?
సూపర్ స్టార్ కృష్ణతో పూరీ జగన్నాథ్ మూవీ.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?