‘రెండు కోట్లా?’ అని దీర్ఘం తీయకండి. బుగట్టి చిరోన్ కార్ల కంపెనీ.. 1930లో తయారు చేసిన 57ఎస్సీ అట్లాంటిక్ కారు తరహా వాచీ ఇది. పేరు ‘ది జీన్ బుగట్టి’. ఇటీవలే మార్కెట్లో విడుదల చేశారు. ఖరీదు 2,50,000 అమెరికన్ డాలర్లు. అంటే మన కరెన్సీలో దాదాపు రెండు కోట్ల రూపాయలు. దీని ప్రత్యేకత ఏమిటంటే.. 1930లో తయారు చేసిన కారుకు వాడిన ఇంజిన్నే ఈ వాచీకి కూడా వాడారు. దీన్ని ధరించిన తర్వాత ఇంజిన్‌లోని మోటారును యాక్టివేట్ చేయవచ్చు. మరుక్షణం నుంచీ కదలికలు మొదలవుతాయి.
మణికట్టుపై బుగట్టీ చిరోన్ కారు వెళ్తున్నట్టే ఉంటుంది. స్విస్ కంపెనీ జాకబ్ అండ్ కోతో కలిసి దీన్ని రూపొందించారు. 46ఎమ్ఎమ్ రౌండ్ కేస్ డిజైన్‌తో గోల్డ్, వైట్ మోడళ్లను లెదర్ పట్టీతో ప్రవేశపెట్టారు. లిమిటెడ్ ఎడిషన్‌గా 57 పీసులు మాత్రమే తయారు చేశారు. వాటిని కూడా అధికారిక అవుట్లెట్ల ద్వారానే విక్రయిస్తున్నారు. గతంలోనూ రూ.11.25 కోట్ల విలువైన వాచీని తయారు చేసి, చరిత్రకెక్కారు బుగ్గట్టి చిరోన్ యజమానులు.