పని ఒత్తిడి, కుటుంబ సమస్యలు.. ఏవైతేనేం చాలామంది రెగ్యులర్గా తలనొప్పితో బాధపడుతుంటారు. దీర్ఘకాలంలో ఇది ‘మైగ్రేన్’గా రూపుదాలుస్తున్నది. నొప్పి నుంచి ఉపశమనం కోసం రోజుకో ట్యాబ్లెట్ మింగాల్సి వస్తున్నది. అయితే, ఇలా తలనొప్పి వచ్చిన ప్రతిసారీ మాత్రలు వేసుకోవడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిదికాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. చిన్నిచిన్న ఇంటి చిట్కాలు పాటించడం ద్వారా.. తలనొప్పి నుంచి ఉపశమనం పొందొచ్చని చెబుతున్నారు.