వంకాయలు: ఎనిమిది, శనగపిండి: ఒక కప్పు, పుట్నాల పొడి: అర కప్పు, వాము: అర టీ స్పూన్, ఉప్పు: తగినంత, వంట సోడా: చిటికెడు, కారం: ఒక టీ స్పూన్, ధనియాల పొడి: ఒక టీ స్పూన్, పల్లీలు: అరకప్పు, నిమ్మరసం: ఒక టేబుల్ స్పూన్, నూనె: సరిపడా, ఉల్లిగడ్డ తరుగు: పావు కప్పు, కొత్తిమీర తరుగు: పావు కప్పు
ఒక గిన్నెలో శనగపిండి, పుట్నాల పొడి, వాము, ఉప్పు, కారం, కుకింగ్ సోడా వేసి కలపాలి. తర్వాత నీళ్లు పోసి జారుగా కలుపుకోవాలి. అందులోనే ఒక టేబుల్ స్పూన్ నూనె కూడా వేసి కలపాలి. మరోవైపు వంకాయల మధ్యలో నాలుగువైపులా గాట్లు పెట్టి, అందులో ఉప్పు, కారం, ధనియాల పొడి వేసి మూయాలి. స్టవ్ మీద వెడల్పాటి గిన్నె పెట్టి నూనె పోయాలి. నూనె వేడయ్యాక వంకాయలను పిండిలో ముంచి నూనెలో వేసి బాగా వేయించుకోవాలి. అదే నూనెలో పల్లీలను కూడా వేయించి పక్కనపెట్టాలి. చివరగా వంకాయ బజ్జీల మధ్యలో గాట్లు పెట్టి పల్లీలు, ఉల్లిగడ్డ తరుగు, కొత్తిమీర తరుగు, నిమ్మరసం వేసి సర్వ్ చేసుకోవాలి.