ఇరాన్‌లోని ఐకానిక్ బ్రిడ్జి ధ్వంసం.. అమెరికా, ఇజ్రాయెల్ భీకరదాడి
పశ్చిమాసియాలో నిర్మాణంలో ఉన్న అతి ఎత్తయిన వంతెనను యూఎస్-ఇజ్రాయెల్ వైమానిక దళాలు దాడి చేసి కూల్చివేశాయి. ఇలాంటి దాడులు మరిన్ని తప్పవని హెచ్చరించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మంటల్లో ఉన్న కూలిన బ్రిడ్జి వీడియోను ట్రూత్ సోషల్‌లో ఉంచారు. ఆలస్యం కాకముందే తమతో ఒప్పందం కుదుర్చుకోవాలని ఇరాన్‌ను హెచ్చరించారు.
- ఆలస్యం కాకముందే ఒప్పందం కుదుర్చుకోవాలని ట్రంప్ హెచ్చరిక
- జోర్డాన్‌లో అమెరికా ఫైటర్‌జెట్లపై డ్రోన్లతో విరుచుకుపడ్డ ఇరాన్
వాషింగ్టన్ : పశ్చిమాసియాలో నిర్మాణంలో ఉన్న అతి ఎత్తయిన వంతెనను యూఎస్-ఇజ్రాయెల్ వైమానిక దళాలు దాడి చేసి కూల్చివేశాయి. ఇలాంటి దాడులు మరిన్ని తప్పవని హెచ్చరించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మంటల్లో ఉన్న కూలిన బ్రిడ్జి వీడియోను ట్రూత్ సోషల్‌లో ఉంచారు. ఆలస్యం కాకముందే తమతో ఒప్పందం కుదుర్చుకోవాలని ఇరాన్‌ను హెచ్చరించారు. ఈ దాడిలో ఇద్దరు పౌరులు గాయపడ్డారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్ పశ్చిమం నుంచి కారజ్ నగరాన్ని కలిపే ఈ బ్రిడ్జి ఎత్తు 136 మీటర్లు. పశ్చిమాసియాలో ఇంజినీరింగ్ అద్భుతంగా దీన్ని పేర్కొనేవారు.
ఇరాన్ ప్రతీకార దాడులు
జోర్డాన్‌లోని అల్ అజ్రాక్ స్థావరంలోని అమెరికా ఫైటర్ జెట్లపై తాము డ్రోన్ దాడి చేసినట్టు ఇరాన్ ప్రకటించింది. జోర్డాన్ బేస్‌లో అమెరికా విమానాలు నిలిపి ఉంచగా ఈ దాడి జరిగింది. అయితే విమానాలకు ఎంత నష్టం వాటిల్లినదీ వివరాలు తెలియరాలేదు. గల్ఫ్‌లో పౌర మౌలిక సదుపాయాలు లక్ష్యంగా తమ దాడులు కొనసాగినట్టు పేర్కొన్నది. తమ దాడులను మరింత విస్తరిస్తామని, అందులో భాగంగా, కువైట్, సౌదీ అరేబియా, అబుదాబి, జోర్డాన్‌లో పలు బ్రిడ్జిలు లక్ష్యంగా తమ మిలిటరీ దాడులు చేసే అవకాశం ఉందని తెలిపింది.
హొర్ముజ్‌ను తెరిపించేందుకు 35 దేశాల సమావేశం.. హాజరైన భారత్
హొర్ముజ్ జలసంధిని తెరిపించేందుకు 35 దేశాల ప్రతినిధులతో జరిగే బహుపాక్షిక చర్చల్లో పాల్గొనాలని యూకే నుంచి భారత్‌కు ఆహ్వానం అందినట్టు విదేశాంగ శాఖ గురువారం వెల్లడించింది. గురువారం సాయంత్రం ప్రారంభమైన ఈ సమావేశానికి భారత్ నుంచి విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ హాజరయ్యారని ఆ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ తెలిపారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, హొర్ముజ్ ప్రతిష్ఠంభన, దానిని తెరిపించేందుకు చేపట్టాల్సిన చర్యల గురించి సమావేశంలో చర్చిస్తారని తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- America
- drones
- Fighter Jets
- iran
RELATED ARTICLES
తాజా వార్తలు
PM Modi | ప్రభుత్వం మారినా రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాం.. తమిళనాడులో ప్రధాని మోదీ
Iran Warning | యెమెన్ విషయంలో జోక్యం వద్దు.. పాకిస్థాన్‌కు ఇరాన్ వార్నింగ్..!
Farmers Protest | కరెంట్ కోతలను నిరసిస్తూ సబ్‌స్టేషన్ వద్ద రైతుల వంటవార్పు
truck rams Durga idol procession | దుర్గా విగ్రహం ఊరేగింపుపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు మృతి, పది మందికి గాయాలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

