సౌందర్య సాధనలో మంచు ముక్కలకు ఇప్పుడు ప్రాధాన్యం పెరిగింది. ఇవి ముఖానికి తాజాదనాన్ని, బిగుతుదనాన్ని అందిస్తాయి. చర్మాన్ని యవ్వనంగా మెరిసేలా ఉంచేందుకు ఐస్ ఫేషియల్ ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు నేటి యువత. అందుకే వారి బ్యూటీ రొటీన్లో ఐస్ ముక్కలూ భాగంగా మారుతున్నాయి. వారి అవసరాన్ని తీర్చేలా మార్కెట్లో దొరుకుతున్నవే ‘కొలాప్సిబుల్ ఐస్ ఫేస్ బౌల్’. సిలికాన్‌తో తయారు చేసిన ఇది మడిచినప్పుడు గుండ్రటి ట్రేలా ఉంటుంది. అందులోని గుంటల్లో నీరు పోసి ఫ్రిజ్‌లో పెట్టుకోవచ్చు.
కావాలనుకుంటే గ్రీన్ టీ సారం, కీరా ముక్కలు, రోజ్ వాటర్ లాంటివి కలిపి ఇందులో ఐస్ క్యూబ్స్ తయారు చేసుకోవచ్చు. ఐస్ గడ్డ కట్టడం పూర్తయ్యాక ఈ ట్రేను చేత్తో నొక్కితే చిన్న టబ్లా మారుతుంది. కేవలం ఐస్ ముక్కల కోసమే కాకుండా, ఈ రోజుల్లో ట్రెండింగ్‌లో ఉన్న ‘ఐస్ ఫేస్ డిప్పింగ్’ థెరపీకి ఇది పర్ఫెక్ట్ చాయిస్. ఇందులో చల్లని నీరు, ఐస్ ముక్కలు వేసి ముఖాన్ని ముంచడం ద్వారా చర్మం కాంతిమంతంగా మారుతుంది. వాడటం పూర్తయ్యాక మళ్లీ దగ్గరికి నొక్కితే ప్లేట్లా మారిపోతుంది. ఎక్కడికైనా ప్రయాణాలకు వెళ్లేటప్పుడు కూడా ఎంచక్కా తీసుకెళ్లొచ్చు. సిలికాన్‌తో చేసేవి రంగురంగుల్లో ఆకర్షణీయంగానూ కనిపిస్తుండటంతో మల్టీపర్పస్ గ్యాడ్జెట్‌గా ఇప్పుడు ఇది యూత్‌ని ఎంతగానో ఆకట్టుకుంటున్నది.