కొందరిలో చర్మ రంధ్రాలు పెద్దవిగా మారుతుంటాయి. దాంతో, ముఖం అందవిహీనంగా కనిపిస్తుంది. ముఖంపై చిన్నచిన్న గుంతల్లాగా ఏర్పడి, వయసు పైబడినట్లుగా ఉంటారు. మేకప్‌లో వాడే రసాయనాలు, సూర్యరశ్మి ప్రభావం ఈ సమస్యకు ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. అయితే, ఇంటి చిట్కాలతోనే వీటిని కనిపించకుండా చేసుకోవచ్చని అంటున్నారు.