రైడ్‌కు.. రైట్‌రైట్!
నవతరం బైక్ రైడింగ్‌పై అమితాసక్తిని చూపిస్తున్నది. ద్విచక్రవాహనంపై లాంగ్‌డ్రైవ్ చేస్తూ.. దేశాన్నే చుట్టేస్తున్నది. అయితే, ఎండలు మండిపోతున్న ప్రస్తుత సమయంలో.. బైక్‌రైడింగ్ సరికొత్త సవాల్ విసురుతుంది.
నవతరం బైక్ రైడింగ్‌పై అమితాసక్తిని చూపిస్తున్నది. ద్విచక్రవాహనంపై లాంగ్‌డ్రైవ్ చేస్తూ.. దేశాన్నే చుట్టేస్తున్నది. అయితే, ఎండలు మండిపోతున్న ప్రస్తుత సమయంలో.. బైక్‌రైడింగ్ సరికొత్త సవాల్ విసురుతుంది. వేడి గాలులు, డీహైడ్రేషన్ వల్ల రైడర్లు త్వరగా అలసిపోయే అవకాశం ఉన్నది. కాబట్టి, ఎండల్లో సురక్షితంగా ప్రయాణించాలంటే.. కొన్ని జాగ్రత్తలు పాటించాలి.
మీ రక్షణ కోసం..
- వదులుగా ఉండే కాటన్ దుస్తులనే ధరించాలి. ఇవి చెమటను పీల్చుకుని శరీరాన్ని చల్లగా ఉంచడంలో సాయపడతాయి. ఎండ తగలకుండా ఫుల్ హ్యాండ్ షర్ట్స్, ఆర్మ్ స్లీవ్స్ వాడాలి. దీనివల్ల స్కిన్ ట్యాన్, సన్‌బర్న్ నుంచి రక్షణ లభిస్తుంది. ఇక నల్లటి రంగు దుస్తులు వేడిని ఎక్కువగా పీల్చుకుంటాయి. కాబట్టి, డ్రైవ్ చేసేటప్పుడు లేతరంగుల్నే ఎంచుకోవాలి.
- గాలి ప్రసరణ బాగుండే ఫుల్‌ఫేస్ హెల్మెట్ ఎంచుకోవాలి. హెల్మెట్ లోపల కాటన్ రుమాల్, స్కల్ క్యాప్ లాంటివి ధరించాలి. చెమట కళ్లలోకి రాకుండా
ఇవి అడ్డుకుంటాయి. - ప్రయాణంలో డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండటం చాలా ముఖ్యం. కాబట్టి, దాహం వేసే వరకూ ఎదురుచూడొద్దు. ప్రయాణం ప్రారంభించే ముందు, మధ్యలో విరామం తీసుకున్నప్పుడు.. తగినంత నీరు తాగుతూనే ఉండాలి. బాగా అలసటగా అనిపించినప్పుడు ఓఆర్ఎస్, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం వంటివి తీసుకుంటే.. శరీరానికి కావాల్సిన శక్తి
లభిస్తుంది. - కళ్లకు రక్షణగా నాణ్యమైన యూవీ ప్రొటెక్షన్ ఉన్న సన్ గ్లాసెస్ ధరించాలి. ఇవి కళ్లకు చల్లదనాన్ని ఇవ్వడమే కాకుండా.. వేడిగాలితో కళ్లు పొడిబారకుండా కాపాడతాయి.
- ముఖంతోపాటు మెడ, చేతులకు మంచి సన్‌స్క్రీన్ లోషన్ రాసుకోవాలి. ముఖానికి చుట్టూ రుమాల్, మాస్క్ లాంటిది ధరిస్తే.. వేడి గాలులు నేరుగా చర్మానికి తగలకుండా ఉంటాయి.
బైక్ రక్షణ కోసం..
- ఎండలకు రోడ్లు చాలా వేడిగా తయారవుతాయి. కాబట్టి, టైర్లలో గాలి మరీ ఎక్కువగా లేకుండా చూసుకోవాలి.
- ఎండకాలంలో బైక్ ఇంజిన్ త్వరగా వేడెక్కుతుంది. కాబట్టి, ఇంజిన్ ఆయిల్ నాణ్యతను, లెవల్‌ను తరచూ చెక్ చేయించుకుంటూ ఉండాలి.
- పెట్రోల్ ట్యాంక్ పూర్తిగా నింపొద్దు. అధిక వేడికి ట్యాంక్ పేలిపోయే ప్రమాదం ఉంటుంది.
- వాతావరణంలోని వేడికి టైర్లలోని గాలి వ్యాకోచిస్తుంది. లాంగ్ డ్రైవ్ చేస్తున్నప్పుడు టైర్లు పగిలిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి, కంపెనీ సూచించిన దానికంటే 1 లేదా 2 పాయింట్ల గాలి తక్కువగా ఉంచుకుంటే మంచిది.
- ఎండలకు బ్యాటరీలోని డిస్టిల్డ్ వాటర్ త్వరగా ఆవిరైపోతుంది. కాబట్టి, అప్పుడప్పుడూ బ్యాటరీని తనిఖీ చేస్తుండాలి.
- ప్రతి 40-50 కి.మీలకు ఒకసారి రైడ్‌కు విరామం ఇవ్వాలి. ఇంజిన్ చల్లబడిన తర్వాత మళ్లీ ప్రయాణం మొదలుపెట్టాలి.
- బైక్‌ను సాధ్యమైనంత వరకు నీడలోనే పార్క్ చేయాలి. దీనివల్ల పెట్రోల్ ఆవిరైపోకుండా, ట్యాంక్ రంగు వెలిసిపోకుండా ఉంటుంది.
- ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అత్యవసరమైతే తప్ప ఈ సమయంలో ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
Supreme Court: సుప్రీంకోర్టును రాజకీయాల్లోకి లాగొద్దు: సీజేఐ సూర్యకాంత్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

