ధనియాల పొడి: 1/3 కప్పు , తామర గింజలు: 1/2 కప్పు , సార పలుకులు: 1 టేబుల్ స్పూను , యాలకులు: 1 టేబుల్ స్పూను , చక్కెర పొడి: రెండున్నర టేబుల్ స్పూన్లు , జీడిపప్పు: రెండున్నర టేబుల్ స్పూన్లు, కొబ్బరిపొడి: అరకప్పు, నెయ్యి: 3/4 కప్పు
ఒక గిన్నెలో నెయ్యి వేసి తామరగింజలు గోధుమ రంగులోకి మారేదాకా వేయించి పక్కనుంచాలి. తర్వాత మరో గిన్నెలో కాస్త నెయ్యి తీసుకొని, కొబ్బరిపొడి వేసి దోరగా వేయించుకోవాలి. తర్వాత జీడిపప్పులు, బాదం పప్పులు, సార పలుకులు వేసి బాగా వేయించాలి. పైనుంచి కొద్దిగా నెయ్యి వేయాలి. ధనియాల పొడి కూడా వేసి బాగా కలిపి మరో గిన్నెలోకి మార్చుకోవాలి. ఇందులో తామర గింజలు వేసి బాగా కలపాలి. పైనుంచి యాలకుల పొడి వేస్తే ధనియా పంజిరి సిద్ధమవుతుంది.