తెల్లజుట్టు.. యువతరంలో సర్వసాధారణ సమస్యగా మారిపోయింది. నిండా ముప్పయ్ ఏండ్లు నిండకుండానే.. నెత్తి నెరిసిపోయి కనిపిస్తున్నది. జీవనశైలి లోపాలతోపాటు ఒత్తిడి, నిద్రలేమి, జంక్‌ఫుడ్.. ఇలా అనేక కారణాలతో జుట్టు తెల్లబడుతున్నది. ముఖ్యంగా.. ‘మెలనిన్ లోపం’ వల్ల చిన్న వయసులోనే వెంట్రుకల రంగు మారుతున్నదని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో తగినంత ‘మెలనిన్’ ఉత్పత్తి కావాలంటే.. ఎలాంటి ఆహారం తీసుకోవాలో సూచిస్తున్నారు.