శరీరంపై, ముఖ్యంగా ముఖంపై ఏర్పడే తెల్ల మచ్చలు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తాయి. సూర్యరశ్మిని తట్టుకోలేని వారికి ‘పాలిమార్ఫస్ లైట్ ఇరప్షన్స్’ కారణంగా ముఖంపై తెల్లమచ్చలు వస్తాయి. ఇక శరీరంలో చర్మానికి రంగునిచ్చే మెలనిన్‌ను ఉత్పత్తి చేసే కణాలు క్షీణించడం వల్ల ‘విటిలిగో’ వస్తుంది. ఈ రెండు రకాలుగా కాకుండా.. మోతాదుకు మించి అతినీలలోహిత కిరణాలకు గురైనా తెల్లమచ్చలు ఏర్పడతాయి. వీటిని పోగొట్టడానికి మార్కెట్లో రకరకాల క్రీములు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేకం. కాబట్టి, మనకు అందుబాటులో ఉన్న పండ్లు, నూనెలతోనే తెల్లమచ్చలను పోగొట్టుకోవచ్చు.
పొప్పడి
ఈ పండును చిన్నచిన్న ముక్కలుగా కోసుకోవాలి. తెల్లమచ్చలు ఉన్నచోట ఆ ముక్కలతో బాగా రుద్దాలి. 15 20 నిమిషాలపాటు అలానే ఉంచేయాలి. ఆ తర్వాత కడుక్కోవాలి. పొప్పడి ముక్కలకు బదులుగా పొప్పడి పేస్టును కూడా వాడొచ్చు.
ఆవనూనె
ఒక గిన్నెలో 3 టేబుల్ స్పూన్ల ఆవనూనె తీసుకోవాలి. దానికి చిటికెడు పసుపు కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని తెల్లమచ్చలు ఉన్నచోట రుద్దుకుని, 15 నిమిషాలపాటు ఉండనివ్వాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో
కడుక్కోవాలి.
వేపాకులు
కొన్ని వేపాకులను రుబ్బి పేస్టుగా చేసుకోవాలి. దానికి ఒక టేబుల్ స్పూన్ తేనె జోడించి బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమంతో తెల్లమచ్చలు ఉన్నచోట మర్దన చేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి.
కలబంద
కలబందలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు చర్మంపై తెల్లమచ్చలను నయం చేయడానికి సాయపడతాయి. తాజా కలబంద నుంచి గుజ్జు తీసుకోవాలి. దానిని తెల్లమచ్చలపై రుద్దుకుని, అరగంట తర్వాత కడుక్కోవాలి.
అల్లం
తాజా అల్లం నుంచి రసం తీసుకోవాలి. దానిని తెల్లమచ్చలపై రుద్దుకుని 10 నిమిషాలపాటు అలానే ఉంచుకోవాలి. ఆ తర్వాత కడిగేసుకోవాలి.
గ్రీన్ టీ
ఓ కప్పు నీటిని మరిగించుకోవాలి. అందులో గ్రీన్ టీ బ్యాగ్‌ను ముంచాలి. చల్లారే వరకు అలానే ఉంచాలి. ఆ తర్వాత దూదితో గ్రీన్ టీని ప్రభావిత ప్రాంతం లో రుద్దుకోవాలి. 15 నిమిషాల తర్వాత మామూలు నీటితో కడుక్కోవాలి.