ఏడాదికి ఒక్కసారైనా సముద్ర స్నానం చేయాలని పెద్దలు అంటుంటారు. శాస్త్రపరంగా ఎలా ఉన్నా.. సైన్స్ పరంగా మాత్రం సాగర స్నానంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అయితే, సముద్ర స్నానం వీలుకానివాళ్లు.. ఇంట్లో నీటిలోనే కొద్దిగా ఉప్పును కలుపుకోవాలని సలహా ఇస్తున్నారు. ‘ఉప్పు నీటి’ స్నానం.. ఆరోగ్యానికి అనేక విధాలుగా మంచిదని అంటున్నారు.
జోర్డాన్ సరిహద్దులో ఉండే డెడ్‌సీ (మృత సముద్రం) సందర్శనకు ఏటా లక్షలమంది పర్యాటకులు తరలివస్తుంటారు. లవణీయత (ఉప్పు శాతం) అత్యధికంగా ఉండే ఈ సముద్రపు నీటితో స్నానం చేస్తే.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని అనేక పరిశోధనల్లోనూ తేలింది. మరి.. ఇలాంటి ప్రయోజనాలే ఇంట్లోనే పొందాలంటే.. నీటిలో కొద్దిగా ఉప్పు కలుపుకొంటే చాలు.