మామిడి పండ్లతో ఇలా చేస్తే జుట్టు రాలడం తగ్గి పట్టులా మారతాయి
Beauty Benefits of Mango | మామిడి పండ్ల బుట్ట ఒకవైపు, గంగాళం నిండా అమృతం ఒకవైపు పెట్టి రెండిట్లో ఏది కావాలంటే మామిడి పండ్లనే ఎంచుకుంటారు ఎవరైనా. మామిడి మాధుర్యమే వేరు. జిహ్వ చాపల్యం తీర్చుకోవడానికే కాదు, కేశాల ఆరోగ్యానికి కూడా మామిడిని విరివిగా ఉపయోగిస్తున్నారు.
♦ పోషకాలలో మామిడిని మించిన పండు లేదు. విటమిన్లు, మినరల్స్, కార్బొహైడ్రేట్లు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్- సి, ఎ, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి6, విటమిన్-కె, పొటాషియం వంటివి మామిడిలో మెండుగా ఉంటాయి. ఊబకాయం, మధుమేహం, గుండెజబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో మామిడి కీలకపాత్ర పోషిస్తుంది. అంతేకాదు, జుట్టు ఆరోగ్యాన్ని పెంచి, కేశాలకు శక్తినీ ఇస్తుంది.

♦ మామిడి పండ్లలో మాంగిఫెరిన్, టర్పెనాయిడ్స్, పాలీఫెనాల్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ నుంచి జుట్టును రక్షిస్తాయి. మామిడిలో ఉండే గల్లోటానిన్స్ వంటి ఫైటోకెమికల్స్ కూడా జుట్టు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మామిడి పండ్లలోని పొయెటిన్ కేశాలను నిగనిగలాడేలా చేస్తుంది.
♦ మామిడి పండ్ల ప్యాక్ జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. కేశాలకు మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది.
♦ చుండ్రుకు మామిడి ప్యాక్ చక్కటి పరిష్కారం. దీనితోపాటుగా జుట్టు పలచబడకుండా, చివర్లు చిట్లకుండా కాపాడుతుంది.
♦ ఒక గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్, ఒక మామిడిపండు గుజ్జును వేసి కలపాలి. దానిని తల నుంచి జుట్టు చివరి వరకు బాగా పట్టించాలి. 30 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. దీంతో సెలూన్‌కు వెళ్లకుండానే మృదువైన జుట్టు మీ సొంతం అవుతుంది.
♦ ఒక మామిడి పండు గుజ్జులో తగినంత కలబంద జెల్, ఒక టేబుల్ స్పూన్ ఆముదం వేసి బాగా కలపాలి. తర్వాత ఆ ప్యాక్‌ను తల నుంచి చివరి వరకు పట్టించాలి. కొద్ది నిమిషాల తర్వాత షాంపూతో తలస్నానం చేస్తే.. జుట్టు డ్యామేజ్ సమస్యే ఉండదు. కుదుళ్లకు పోషణ అందడంతో పాటు, చివర్లు చిట్లి పోకుండా ఉంటాయి.
Read More :
Mangoes | కార్బైడ్‌తో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి”
“పెరుగుతో కలిపి తినకూడని పదార్థాలు ఏవి? ఎందుకు?”
“మామిడి పండ్లు తినగానే ఆ ఐదింటి జోలికి అసలే పోవద్దు..!”
“జుట్టుకే కాదు కొబ్బరి నూనెతో ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా”
“పుట్టగొడుగులు ఆరోగ్యానికే కాదు.. అందాన్ని కూడా పెంచుతాయని తెలుసా!!”
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

