మనవాళ్లెప్పుడూ అలంకరణలో వినూత్నతను కోరుకుంటారు. అందులోనూ పెళ్లికూతురిగా కనిపించాలంటే మరింత ప్రత్యేకమైన ముస్తాబుకు ఓటేస్తారు. భిన్నత్వంలో ఏకత్వం భారతీయ విధానం. ఇందులో ఒక్కో రాష్ర్టానిది ఒక్కో ప్రత్యేకత. బొట్టు అందరూ పెట్టుకున్నా సంప్రదాయాన్ని బట్టి ఆకృతి మారుతూ ఉంటుంది. ఇక్కడ మాడల్ సనా థాంపీ పెట్టుకున్నది పశ్చిమ బెంగాల్ తరహా పెళ్లి బొట్టు. దానికి సరిపోయేలా హాఫ్వైట్ రంగులో లినెన్ జరీ చీర ధరించింది. ఇక మాడ్రన్గా కనిపిస్తూనే పెళ్లికూతురి లుక్ తీసుకొచ్చేందుకు ఆమ్రపాలి సంస్థ తయారుచేసిన అర్ధచంద్రాకారపు హెయిర్ బన్ పిన్ పెట్టుకుంది. ముస్తాబు అదిరింది కదూ!