డాక్యుమెంట్స్ రాసుకోవడం.. వర్క్‌షీట్స్ ప్రిపేర్ చేయడం.. డెస్క్‌టాప్ పబ్లిషింగ్.. డిజైనింగ్.. అంతా ఆన్లైన్లోనే చేస్తున్నాం. అందుకు తగిన టూల్స్ కూడా నెట్టింట్లో సిద్ధంగా ఉన్నాయి. ఈ క్రమంలో వెబ్ ఓఎస్‌తో పనిచేసే ల్యాపీలు అనగానే.. క్రోమ్ బుక్లే గుర్తుకు వస్తాయి.
కొన్నేళ్లుగా ప్రత్యేక ‘క్రోమ్ ఓఎస్’ తో గూగుల్ ‘క్రోమ్ బుక్’లను అందిస్తున్నది. ఓఎస్ ఇన్‌స్టాలేషన్స్, అప్లికేషన్ సాఫ్ట్వేర్లతో సతమతం కాకుండా.. సింపుల్‌గా 10 సెకన్లలో క్రోమ్ బుక్‌లు ఆన్ అవుతాయి. జస్ట్ మీ గూగుల్ అకౌంట్‌తో లాగిన్ అయిపోతే సరి. వెంటనే క్రోమ్ ఓఎస్‌తో అన్నీ సిద్ధం అయిపోతాయి. ఆఫ్లైన్లోనూ వీటిని వాడుకోవచ్చు.
ఇంతలా నెటిజన్లకు దగ్గరైన క్రోమ్ బుక్‌లు.. ‘ఓఎస్ 130’ వెర్షన్‌తో అప్డేట్ కానున్నాయి. దీంట్లో కొన్ని వినూత్న ఫీచర్లను క్రోమ్ బుక్ యూజర్లకు పరిచయం చేస్తున్నది. న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్‌తో అందుబాటులో ఉన్న క్రోమ్‌బుక్ ప్లస్ మోడల్స్‌లో ‘ఏఐ’ ఆధారిత ఫీచర్స్ ఉన్నాయి. ఉదాహరణకు రికార్డర్ యాప్ సదుపాయంతో మైక్రోఫోన్, కెమెరాల్ని మనకి నచ్చినట్టుగా మార్పులు చేయొచ్చు.
జెమిని ఏఐ టూల్స్‌తో ఆర్టికల్స్ వినొచ్చు. ‘క్విక్ ఇన్సర్ట్’ ఫీచర్‌తో ఎప్పుడైనా ఎక్కడైనా ఎమోజీలు, జిఫ్లతోపాటు డ్రైవ్లింక్లను షేర్ చేయొచ్చు. ఏదైనా ముఖ్యమైన పని చేస్తున్నప్పుడు ‘ఫోకస్’ మోడ్‌లో పెట్టుకోవచ్చు. దీంతో ఎలాంటి నోటిఫికేషన్స్, ఇతర పాప్అప్లు కనిపించవు. అందుకు ‘do not disturb’ ఫీచర్‌ని ఎనేబుల్ చేయాలి.
‘క్విక్ సెట్టింగ్స్’ మెనూలోకి వెళ్లి ఈ ఫీచర్‌ని పెట్టుకోవచ్చు. మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటంటే.. ‘రీక్యాప్’. దీన్ని ఎనేబుల్ చేస్తే.. వెబ్‌లో మీరు చేసిన రీసెంట్ యాక్టివిటీలను ఎప్పుడైనా రివైండ్ చేసుకోవచ్చు. పనిలో భాగంలో మీరెక్కడైనా డైవర్ట్ అయ్యి టైమ్ వృథా చేస్తున్నారని మీకు అనిపిస్తే ఒకసారి రీక్యాప్ చేసి చూసుకోవచ్చు.