ఫ్రైడ్ చికెన్ స్టిక్స్
ముందుగా చికెన్ బ్రెస్ట్ పీసెస్‌ను జాగ్రత్తగా మధ్యలోకి కట్ చెయ్యాలి. ఒక కవర్‌పై ఒక్కో ముక్కను పెట్టి పైనుంచి కవర్ వేసి పప్పుగుత్తిలాంటి వస్తువుతో మెల్లగా కొట్టాలి. వాటిని తీసి ఒక ప్లేట్లో పరిచి రెండువైపులా కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి చల్లాలి. ఒక గిన్నెలో గుడ్లు వేసి చిటికెడు ఉప్పు జోడించి బాగా కలపాలి. ఒక ప్లేట్లో బ్రెడ్ క్రంబ్స్, ఉప్పు, కారం, మిరియాల పొడి వేసి కలగలపాలి. కడాయిలో నూనె వేడిచేసి.. ఒక్కో చికెన్ ముక్కనూ మైదాలో దొర్లించి, గుడ్ల మిశ్రమంలో ముంచి
కావలసిన పదార్థాలు
చికెన్ బ్రెస్ట్ పీసెస్ (బోన్‌లెస్): రెండు, మైదాపిండి: అర కప్పు, గుడ్లు: మూడు, బ్రెడ్ క్రంబ్స్: ఒక కప్పు, మిరియాల పొడి: అర టీస్పూన్, ఉప్పు: తగినంత, కారం: అర టీస్పూన్, నూనె: వేయించడానికి సరిపడా.
తయారీ విధానం
ముందుగా చికెన్ బ్రెస్ట్ పీసెస్‌ను జాగ్రత్తగా మధ్యలోకి కట్ చెయ్యాలి. ఒక కవర్‌పై ఒక్కో ముక్కను పెట్టి పైనుంచి కవర్ వేసి పప్పుగుత్తిలాంటి వస్తువుతో మెల్లగా కొట్టాలి. వాటిని తీసి ఒక ప్లేట్లో పరిచి రెండువైపులా కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి చల్లాలి. ఒక గిన్నెలో గుడ్లు వేసి చిటికెడు ఉప్పు జోడించి బాగా కలపాలి. ఒక ప్లేట్లో బ్రెడ్ క్రంబ్స్, ఉప్పు, కారం, మిరియాల పొడి వేసి కలగలపాలి. కడాయిలో నూనె వేడిచేసి.. ఒక్కో చికెన్ ముక్కనూ మైదాలో దొర్లించి, గుడ్ల మిశ్రమంలో ముంచి, చివరగా బ్రెడ్ క్రంబ్స్ పట్టించి కాగిన నూనెలో వెయ్యాలి. సన్నని మంటపై రెండువైపులా దోరగా కాల్చుకుంటే ఫ్రైడ్ చికెన్ స్ట్టిక్స్ సిద్ధం.ఫ్రైడ్ చికెన్ స్టిక్స్
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

