ఫ్రిజ్ క్లీనింగ్.. ఈజీగా!
వేసవిలో వేడి వాతావరణానికి ఆహార పదార్థాలు త్వరగా పాడవుతాయి. కాబట్టి నీళ్లు, పండ్లు మొదలుకొని.. పచ్చళ్ల దాకా అన్నీ ఫ్రిజ్లో చేరుతాయి. దాంతో, రిఫ్రిజిరేటర్ కిటకిటలాడుతూ ఉంటుంది. అన్నిరకాల ఆహార పదార్థాల వాసనలు కలిసి.. ఫ్రిజ్ లోపలి నుంచి చెడు వాసన వస్తుంటుంది.
వేసవిలో వేడి వాతావరణానికి ఆహార పదార్థాలు త్వరగా పాడవుతాయి. కాబట్టి నీళ్లు, పండ్లు మొదలుకొని.. పచ్చళ్ల దాకా అన్నీ ఫ్రిజ్లో చేరుతాయి. దాంతో, రిఫ్రిజిరేటర్ కిటకిటలాడుతూ ఉంటుంది. అన్నిరకాల ఆహార పదార్థాల వాసనలు కలిసి.. ఫ్రిజ్ లోపలి నుంచి చెడు వాసన వస్తుంటుంది. ఈ సమస్యకు కొన్ని సహజమైన పద్ధతులతో చెక్ పెట్టేయొచ్చు.
- ఫ్రిజ్ షెల్ఫ్ మూలల్లో లవంగాలను ఉంచండి. ఇవి చెడు వాసనలను పీల్చుకొని.. ఫ్రిజ్ను శుభ్రంగా మారుస్తాయి. సువాసనను అందిస్తాయి.
- వంటింట్లో ఉండే వెనీలా ఎసెన్స్ను కొద్దిగా దూదిమీద వేసి ఫ్రిజ్లో ఉంచినా.. మంచి ఫలితం కనిపిస్తుంది. దుర్వాసన మాయమవడంతోపాటు లోపలంతా తాజాదనాన్ని తీసుకొస్తుంది.
- కాఫీ పొడి సువాసనలు కూడా.. ఫ్రిజ్లో చెడు వాసనలను దూరం చేస్తాయి. ఇందుకోసం ఒక చిన్న గిన్నెలో కొద్దిగా కాఫీ పౌడర్ వేసి, ఫ్రిజ్లో ఉంచేస్తే చాలు.
- ఒక చిన్న డబ్బాలో యాక్టివేటెడ్ చార్కోల్ పొడి వేసి ఫ్రిజ్లో ఉంచాలి. ఇది ఫ్రిజ్లో చెడు వాసనలను పీల్చుకుని.. స్వచ్ఛమైన వాతావరణాన్ని అందిస్తుంది.
- నీటిలో కొద్దిగా వెనిగర్ కలిపి.. ఆ మిశ్రమంతో ఫ్రిజ్ లోపల బాగా తుడవాలి. దీనివల్ల ఫ్రిజ్లో పెరిగే బ్యాక్టీరియా, వాసన కలిగించే ఇతర క్రిములు తొలగిపోయి.. ఫ్రిజ్ శుభ్రంగా తయారవుతుంది.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

