‘ఆ తొమ్మిది నెలలూ మాంసాహారం మంచిది కాదు, ఓ దశలో విషపూరితంగా మారి బిడ్డ ఆరోగ్యాన్ని బలి తీసుకుంటుంది’..అనే ప్రచారం ఉంది. ఇది అపోహ మాత్రమేనని కొట్టిపారేస్తున్నారు పోషకాహార నిపుణులు.కొన్ని నిబంధనలకు లోబడి నాన్‌వెజ్ ఆరగించవచ్చని అంటున్నారు.

గర్భధారణ సమయంలో కొందరికి కొన్ని ఆహార పదార్థాలు పడకపోవచ్చు. ఫలితంగా వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి తదితర సమస్యలు వస్తాయి. అరుదైన సందర్భాల్లో చేపలు, గుడ్డు కూడా పడకపోవచ్చు. అలాంటివారు నాన్‌వెజ్ జోలికి వెళ్లక పోవడమే ఉత్తమం.
నిజానికి, తగిన మోతాదులో మాంసాహారం మంచిదే. తల్లి శరీరానికి అవసరమైన కొవ్వులు, ఆమ్లాలు అందుతాయి. కడుపులోని బిడ్డ్డా ఆరోగ్యంగా ఉంటుంది. పరిమితి మించితే మాత్రం.. జీర్ణ సమస్యలు, డయేరియా, మలబద్ధకం, కడుపు ఉబ్బరం వంటి రుగ్మతలు తలెత్తుతాయి.
గర్భిణులకు చికెన్ మంచిచేస్తుంది. ఇది సురక్షితమైన మాంసాహారమనీ చెబుతారు. అయితే, మసాలాలు తగ్గించాలి. మరీ ఎక్కువగా నూనెల్లో వేయించ కూడదు. పొట్టేలు మాంసంలో ప్రొటీన్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. మటన్‌తో పోల్చితే ఇది చాలా ఉత్తమం. కానీ, ఎక్కువ కాలం నిలువ ఉంచిన మాంసం ప్రమాదకరం.
ట్యూనా ఫిష్‌ను శాండ్విచ్ రూపంలో కొద్ది మోతాదులో తీసుకోవచ్చు. వీటిలో ఒమేగా -6 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉంటాయి. గుడ్డులోని తెల్లసొనలో క్యాల్షియం పుష్కలం. పిండం ఎదుగుదలకూ సాయపడుతుంది. తరచూ నాన్‌వెజ్ సూప్స్ తీసుకోవచ్చు. ఏ ఆహారమైనా సరే, శరీరం నుంచి ఏ కొంత వ్యతిరేకత ఎదురైనా.. వైద్యులను సంప్రదించాలి. ఈ దశలో ప్రయోగాలు పనికిరావు. తల్లీబిడ్డలకు క్షేమమూ కాదు.