ఇప్పుడు ప్రపంచమంతా స్మార్ట్‌ఫోన్‌లోనే సంచరిస్తున్నది! ఎంటర్టైన్మెంట్ గురించి అయితే చెప్పనక్కర్లేదు. మరైతే.. దీపావళి పటాకులను ఫోన్లోనే ఎందుకు కాల్చకూడదు? ఎకో ఫ్రెండ్లీగానో, టైమ్పాస్కో కాసేపు మీ స్మార్ట్‌ఫోన్‌లో పటాకులు కాల్చండి. అందుకు గూగుల్ ప్లే స్టోర్‌లో ఎన్నో యాప్స్ ఉన్నాయి. కావాలంటే Fireworks Play యాప్‌ని ఇన్స్టాల్ చేయండి.
ఇదో 3డీ ఫైర్ వర్క్స్ స్టిమ్యులేటర్. అదిరే క్రాకర్ గ్రాఫిక్స్‌తో గేమ్‌ని రూపొందించారు. మీకు నచ్చిన క్రాకర్ ఐటమ్స్‌ని సెలెక్ట్ చేసుకుని వెలిగించడమే. క్రాకర్స్ ఎలా పేలిపోవాలో మీరే సెట్ చేయొచ్చు. ఒక్కసారి ఆల్‌సెట్ అనుకున్నాక ఫైర్ ఆప్షన్ క్లిక్ చేస్తే సరి! సింగిల్, మల్టిప్లేయర్ మోడ్స్‌లో గేమ్ ఆడొచ్చు. ఒకవేళ పీసీలో ఆడుదాం అనుకుంటే.. ప్లే స్టోర్‌లోని ‘ఇన్స్టాల్ విండోస్’
ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. డౌన్లోడ్ లింక్: https://l1nk.dev/aSia3