సార్ ప్రశంసే.. ఆస్కార్ అంటున్న బృందా మాస్టర్
బృందా మాస్టర్ పేరు వినగానే డ్యాన్స్ ప్రియుల కళ్లలో మెరుపు కనిపిస్తుంది. హీరో హీరోయిన్లతో అదిరిపోయే స్టెప్పులు వేయించడంలో ఆమె దిట్ట. సూపర్ స్టార్ రజనీకాంత్ మొదలు స్టైలిష్‌స్టార్ బన్నీ వరకు.. ఈ ముప్పై అయిదు సంవత్సరాల కెరీర్లో ఆమెతో కలిసి పనిచేయని దక్షిణాది తారలు లేరేమో. మణిరత్నం దర్శకత్వంలో ఇటీవల విడుదలైన ‘పొన్నియిన్ సెల్వన్'లో తన కొరియోగ్రఫీకి చప్పట్లమోత మోగుతున్నది. ఈ సందర్భంగా సినిమాల గురించీ, కెరీర్ గురించీ బృంద ముచ్చట్లు..
బృందా మాస్టర్ పేరు వినగానే డ్యాన్స్ ప్రియుల కళ్లలో మెరుపు కనిపిస్తుంది. హీరో హీరోయిన్లతో అదిరిపోయే స్టెప్పులు వేయించడంలో ఆమె దిట్ట. సూపర్ స్టార్ రజనీకాంత్ మొదలు స్టైలిష్‌స్టార్ బన్నీ వరకు.. ఈ ముప్పై అయిదు సంవత్సరాల కెరీర్లో ఆమెతో కలిసి పనిచేయని దక్షిణాది తారలు లేరేమో. మణిరత్నం దర్శకత్వంలో ఇటీవల విడుదలైన ‘పొన్నియిన్ సెల్వన్’లో తన కొరియోగ్రఫీకి చప్పట్లమోత మోగుతున్నది. ఈ సందర్భంగా సినిమాల గురించీ, కెరీర్ గురించీ బృంద ముచ్చట్లు..
మణిరత్నం సినిమాలో పనిచేయడంలో ఎంత కష్టం ఉంటుందో, అంత థ్రిల్ కూడా ఉంటుంది. ఆయనకు ప్రతి విషయం మీదా స్పష్టమైన విజన్ ఉంటుంది. పాటల్లో కూడా తను అనుకున్న దాన్ని యథాతథంగా తెరమీద చూపాలని అనుకుంటారు. అదే సమయంలో కొరియోగ్రాఫర్లుగా మాకు పూర్తి స్వేచ్ఛ ఇస్తారు. మా సృజనాత్మకతను నిరూపించుకునే అవకాశం ఇస్తారు.
‘పొన్నియిన్ సెల్వన్’లో హీరో ఇంట్రొడక్షన్ సాంగ్ అలాంటిదే. అందులో జానపద రీతిలో సాగే పాటలోనే హీరోను ఎలివేట్ చేసేలా కొరియోగ్రఫీ చేయాల్సి వచ్చింది. ఆ ట్రైబల్ సాంగ్ పూర్తికాగానే మణిరత్నం సార్ లేచి నిలబడి ‘ఫెంటాస్టిక్ కొరియోగ్రఫీ’ అన్నారు. ఆయన మెచ్చుకోలు నా దృష్టిలో ఆస్కార్‌తో సమానం. మా కష్టానికి తగ్గట్టే ఈ సినిమా పాటలు, కొరియోగ్రఫీ జనానికి బాగా నచ్చాయి.
కెరీర్ సాగిందిలా…
మేం ఏడుగురు అక్కాచెల్లెళ్లం. నేను చివరిదాన్ని. అక్కలు గిరిజ, కళ కూడా కొరియోగ్రాఫర్లే. రఘురామ్ మాస్టర్‌తో కలిసి పనిచేసింది గిరిజ. తర్వాత ఆయన్నే పెండ్లాడింది. కళకు, నాకు కూడా ఆయనే గురువు. నేను రఘురామ్‌గారి దగ్గర ఎనిమిది సంవత్సరాలు అసిస్టెంట్‌గా పనిచేశాను. సెట్స్ మీద ఉన్నప్పుడు చుట్టరికం గురించి ఆలోచించను. ఆ తర్వాత నెమ్మదిగా నేనే సొంతంగా సినిమాలకు కొరియోగ్రఫీ చేయడం ప్రారంభిచాను. ఈ మూడున్నర దశాబ్దాల్లో కన్నడ, మలయాళ, తెలుగు, హిందీ తదితర భాషల్లో అనేక చిత్రాలకు కొరియోగ్రఫీ చేశాను. రెండు తరాలకు చెందిన హీరో హీరోయిన్లతో కలిసి పనిచేశాను. ‘ఢీ’లాంటి డాన్స్ షోల రూపకల్పనలో భాగం అయ్యాను. ఆ కార్యక్రమానికి జడ్జిగా పనిచేసి తెలుగు ప్రేక్షకులకూ దగ్గరయ్యాను. ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా జాతీయ అవార్డుతో పాటు, తమిళనాడు ప్రభుత్వం నుంచి రెండుసార్లు, కేరళ ప్రభుత్వం నుంచి నాలుగుసార్లు పురస్కారాలు అందుకున్నాను. అయితే నేను అవార్డులకు పొంగిపోను. ప్రతి పాటనూ అదే నా మొదటి పాటగా భావించి కొరియోగ్రఫీ చేస్తాను. దుల్కర్ సల్మాన్ హీరోగా ఒక సినిమాకు దర్శకత్వం వహించాను.
నిజానికి నా కెరీర్ తొలి అడుగులు అంత సులభంగా ఏం పడలేదు. నల్లగా ఉన్నాననే కారణంతో, ఆడపిల్లనన్న వంకతో మొదట్లో పెద్దగా అవకాశాలు రాలేదు. కానీ మన దగ్గరున్న విద్య మనల్ని ఎప్పటికీ ఓడిపోనివ్వదు. అయితే దానికి వినయం, సంస్కారం తోడు కావాలి. నా ప్రస్థానమే అందుకు ఉదాహరణ.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cult Review | ‘కల్ట్’ సినిమా రివ్యూ.. విశ్వక్సేన్ కొత్త సినిమా ఎలా ఉందంటే!
Inter Student | అపార్ట్‌మెంట్‌పై నుంచి దూకి ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
Rise | రూ.100 చేరువలో కిలో బియ్యం..! సామాన్య ప్రజల రక్తం తాగుతున్న రైస్ మాఫియా
Soil Fertility | భూసారాన్ని కాపాడితేనే భవిష్యత్ ..వ్యవసాయానికి భరోసా
భద్రాచలం ఆలయ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి : కలెక్టర్ అంకిత్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

