చిక్కని కుచ్చిళ్లతో నిండుగా కనిపించే చక్కని డ్రెస్సు.. గౌను. ఒకప్పుడు చిన్నపిల్లలు మాత్రమే వేసుకునేవారు. ఇప్పుడు తరాల అంతరాలు చెరిగిపోయాయి. అందరూ డిజైనర్ గౌన్లు ధరిస్తున్నారు. అందులోనూ, నలుగురిలో ప్రత్యేకంగా నిలిపే గౌన్ల డిజైన్లేమిటో చూద్దామా!
నీ నవ్వు నీలి సముద్రం
దుస్తులకు నిండుదనాన్నిచ్చే రంగు బ్లూ. నీలిరంగు మంగళగిరి ప్లెయిన్ కాటన్ ఫ్యాబ్రిక్‌తో ఈ గౌను డిజైన్ చేశారు. కింద మూడు వరుసల్లో ప్రిల్స్ ఇచ్చి, ఫుల్ లెన్త్ సైజ్‌లో రూపొందించారు. బాడీ పార్ట్‌లో సింపుల్‌గా రౌండ్ నెక్ ఇచ్చి, పై నుంచి బ్లూ డాట్స్ ఉన్న హాఫ్ వైట్ ఫ్యాబ్రిక్‌తో బ్లేజర్లాంటి కోటు ఇచ్చారు. ఫుల్ హ్యాండ్స్, పీటర్ పాన్ కాలర్‌తో ఓపెన్‌గా ఉన్న బ్లేజర్ స్టయిలిష్ లుక్
ఇస్తున్నది.
ఓహో గులాబి బాలా!
అమ్మాయిలకు అతి ఇష్టమైన పింక్ అండ్ వైట్ కాంబినేషన్లో డిజైన్ చేసిన గౌను ఇది. పై భాగంలో హాఫ్ వైట్ ఫ్యాబ్రిక్‌తో ఒక వరుస, కింద భాగంలో పింక్ కలర్ మంగళగిరి ఫ్యాబ్రిక్‌తో రెండు వరుసల్లో ప్రిల్స్ ఇచ్చారు. బాటమ్‌లో వాడిన ఫ్యాబ్రిక్‌తో గౌను పైనుంచి వేసుకునేలా చిన్న కోటు డిజైన్ చేశారు. గౌనుకు కాకుండా, వెరైటీగా కోటుకు ఇచ్చిన ఎల్బో లెన్త్ పఫ్ హ్యాండ్స్ కొత్తగా ఉన్నాయి. కోటు గౌనుపై అమరేలా కుట్టిన డోరీలు, చివర్లో ఇచ్చిన టసల్స్ అదనపు ఆకర్షణ.
రితీషా రెడ్డి
ఇషా డిజైనర్ హౌస్ follow us on: instagram.com/
riteshareddy, 70136 39335