వివాహాది శుభకార్యాలకు పుత్తడి బొమ్మ పట్టుచీర కట్టాల్సిందే. కాకపోతే, కాలంతోపాటు ట్రెండ్స్ మారిపోతాయి. మ్యాచింగ్ రవికలు పాతబడిపోతాయి. దాంతోపాటే చీరలూ మూలనపడతాయి. ఈ సమస్య లేకుండా.. ఎలాంటి పట్టుచీర మీదికైనా అతికినట్టు సరిపోయే డిజైనర్ బ్లౌజ్‌లు వచ్చాయి. వాటికి మగ్గం వర్క్ తోడైంది. దీంతో పాతచీర కొత్తగా, కొత్తచీర మరింత కొత్తగా కనిపించడం ఖాయం.
ఎంబ్రాయిడరీతో…
ముదురు నీలిరంగు పట్టు ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన చీర ఇది. ప్లెయిన్ బ్లూకలర్ ఫ్యాబ్రిక్‌పై గోల్డ్ కలర్ జరీతో పూలు, తీగలతో కూడిన పెద్ద బార్డర్ ఇచ్చారు. చీరంతా పువ్వులు పరిచారు. దీనిపై డార్క్ పింక్ రా సిల్క్ బ్లౌజ్ ఎంచుకున్నారు. చీరకు నప్పేలా బ్లూ కలర్ పట్టు ఫ్యాబ్రిక్‌తో పఫ్ హ్యాండ్స్ జతచేశారు. నెక్లైన్, హ్యాండ్స్‌కు మిక్స్డ్ కలర్ త్రెడ్‌తో మగ్గం వర్క్ ..బ్లౌజ్‌కు ప్రత్యేకత తెచ్చిపెట్టాయి.
మోడల్: మౌనిక
పూసలతో..
అతివలు మెచ్చే వర్ణం గులాబీ. పట్టు చీరల్లోనూ గులాబీ వర్ణానిదే పెత్తనం. పింక్ ఫ్యాబ్రిక్‌పై సిల్వర్ జరీతో డిజైన్ చేసిన చీర ఇది. ప్లెయిన్ పింక్ ఫ్యాబ్రిక్‌పై సిల్వర్ జరీతో చెక్స్ ఇచ్చారు. సిల్వర్ బార్డర్ జతచేయడంతో మరింత హైలైట్ అయింది. బార్డర్‌కు కాంట్రాస్ట్‌గా ఫిరోజ్ బ్లూ కలర్ రా సిల్క్ ఫ్యాబ్రిక్‌తో బ్లౌజ్ ఇచ్చారు. పట్టుచీరపై హెవీలుక్ వచ్చేలా సిల్వర్ కలర్ బీడ్స్‌తో జర్దోసితోపాటు మగ్గం వర్క్ చేశారు. నెక్లైన్, హ్యాండ్స్‌కు కర్వ్ లైన్ ఇవ్వడంతో ట్రెండీలుక్ వచ్చేసింది.
మోడల్: చైత్రా రాయ్
రితీషా రెడ్డి
ఇషా డిజైనర్ హౌస్ follow us on: instagram.com/
riteshareddy, 70136 39335