వర్షాకాలంలో కంటివ్యాధులు ఎక్కువే. గాలిలోని విష క్రిములు తేమలో మరింత రెచ్చిపోతాయి. కాబట్టి, ఏ చిన్న సమస్య వచ్చినా నేత్ర వైద్యుడ్ని సంప్రదించాలి. కొన్నిసార్లు కళ్లు ఎర్రగా వాచి, నొప్పితో పాటు దురద కూడా ఇబ్బంది పెడుతుంది. కండ్లకలక, కళ్లు పొడిబారడం, కార్నియల్ అల్సర్ వంటి ఇన్ఫెక్షన్లూ దాడి చేస్తాయి.
ట్రకోమా అనే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ మరింత ప్రమాదకరం. నిర్లక్ష్యం చేస్తే అంధత్వమూ రావచ్చు. కాబట్టి, బయటికి వెళ్లొచ్చినప్పుడు చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవాలి. తువాళ్లు, బెడ్షీట్ తరచూ ఉతకాలి. ఈత సమయంలో కాంటాక్ట్ లెన్స్ అస్సలు ఉపయో గించొద్దు. ట్రెక్కింగ్, సైక్లింగ్ లాంటివి చేస్తున్నప్పుడు ప్రొటెక్టివ్ ఐ లెన్స్ ఉపయోగించాలి. కళ్లలో ఏదైనా అసౌకర్యం, ఇతర ఇబ్బందులు ఉంటే వెంటనే కంటి డాక్టర్ను సంప్రదించాలి. వైద్యుల సిఫారసు మేరకే లూబ్రికేటింగ్ కంటిచుక్కలు వాడాలి.