Umbrella | ఈ గొడుగులతో వర్షాన్ని ఎంజాయ్ చేయండి
Transparent Umbrella | కారుమబ్బులు కమ్ముతుంటే హాయి. వానజల్లులో తడవాలంటే ఇంకా హాయి. కానీ, నీటిముల్లు గుచ్చుకుంటుందని గొడుగు కిందికి చేరిపోతాం. నింగి వీడిన చినుకులు చేసే విన్యాసాలను ఆస్వాదించే అవకాశం కోల్పోతాం. ఈ పారదర్శక గొడుగు చేతిలో ఉంటే.. వర్షాతిరేకాలను కండ్లారా ఆస్వాదించొచ్చు.
అల్లంత దూరం నుంచీ మీద పడుతుందనుకున్న తుంటరి చినుకు.. గొడుగు ఉపరితలాన పడీపడగానే థిల్లానా జతులు పాడి ధారగా జారుకుంటుంది. పెద్దపెట్టున రాలే చిట్టి చినుకులు గట్టిమేళాన్ని వినిపిస్తాయి. తనువు తడవకుండానే, వానజాణ వయ్యారాలను తనివితీరేలా అనుభవించాలంటే పారదర్శక గొడుగు కొనేయండి. ఆన్లైన్ ముంగిట్లో, ఆఫ్‌లైన్ అంగట్లో అందుబాటులో ఉన్నాయివి. ఈ గొడుగు జతగా ఉంటే… పొద్దంతా ముసురుపట్టినా విసుగు పుట్టదంటే నమ్మండి.
Read More :
“ఈ గొడుగు పట్టుకుంటే తడిసిపోతాం.. కానీ ధర మాత్రం లక్ష రూపాయలంట !!”
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

