Bathukamma | ఇవాళే ఎంగిలిపూల బతుకమ్మ.. ఏం చేస్తారంటే..!
ప్రపంచమంతా పూలతో పూజిస్తే.. పూలనే పూజించే గొప్ప సంస్కృతి మనది. ప్రకృతిని ఆరాధించే మహోన్నత వారసత్వానికి ప్రతీక మన బతుకమ్మ పండుగ. అమావాస్య మొదలు దుర్గాష్టమి వరకు జరిగే మహోన్నత వేడుక. మొదటి రోజైన అమావాస్య నాడు ‘ఎంగిలిపూల’ బతుకమ్మను పేరుస్తారు.
Bathukamma | ప్రపంచమంతా పూలతో పూజిస్తే.. పూలనే పూజించే గొప్ప సంస్కృతి మనది. ప్రకృతిని ఆరాధించే మహోన్నత వారసత్వానికి ప్రతీక మన బతుకమ్మ పండుగ. అమావాస్య మొదలు దుర్గాష్టమి వరకు జరిగే మహోన్నత వేడుక. మొదటి రోజైన అమావాస్య నాడు ‘ఎంగిలిపూల’ బతుకమ్మను పేరుస్తారు. సాధారణంగా మహాలయ అమావాస్య నాడు ఎంగిలి పూల బతుకమ్మ మొదలవుతుంది. ఆనాడు ఇంటి యజమాని పితృదేవతలకు తర్పణాలు విడుస్తారు. పిండ ప్రదానం చేయలేని వాళ్లు పెద్దల పేరిట బ్రాహ్మణుడికి సాయిత్యం (వంట సామగ్రి) ఇస్తారు.
ఈ సందర్భంగాపెద్దలకు ప్రీతిగా పెసరపప్పు గారెలు, పాయసం నైవేద్యంగా సమర్పిస్తారు. సాయంత్రం గుమ్మంలో నీళ్లు చల్లి, ముగ్గులుపెడతారు. ఉదయాన తెచ్చుకున్న తంగేడు పూలు, గుమ్మడి పూలు, గునుగు పూలతో తల్లి బతుకమ్మ, పిల్ల బతుకమ్మ పేర్చుతారు. వీధిలోని వారంతా బతుకమ్మ ఆడతారు. ఉదయం నానబెట్టిన (మిగిలిన వడపప్పు) పెసరపప్పు, దోసకాయ ముక్కలు నైవేద్యంగా పెడతారు. పెద్దలకు పెట్టగా మిగిలింది కనుక ఎంగిలి (వాడిన) పప్పుగా, భోజనాలయ్యాక పేర్చే బతుకమ్మ కనుక దీనిని ఎంగిలి పూల బతుకమ్మ అని పిలుస్తుంటారు. ఇవాళ్టి నుంచి మొదలయ్యే బతుకమ్మ సందడి తెలంగాణ వైభవాన్ని తొమ్మిది రోజులు చాటుతుంది.
– డా॥ ఆర్.కమల
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mamitha Baiju | మమితా బైజు అసలు పేరు నమితనా? బర్త్ సర్టిఫికెట్లో జరిగిన పొరపాటుతో పేరు ఎలా మారిందో తెలుసా?
Plane Crash | ట్రంప్ నివాసానికి సమీపంలో కుప్పకూలిన ప్రైవేట్ జెట్.. తొమ్మిది మంది మృతి
Cyclone Murasu | తీవ్ర తుపానుగా బలపడిన ‘మురాసు’.. ఏపీ తీరానికి పొంచి ఉన్న పెను ముప్పు!
గ్లామర్ డోస్ పెంచేసిన హెబ్బా పటేల్.. బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బోల్డ్ ఫొటోషూట్!
Ramayana | రామాయణకు భారీ స్పందన.. ఒక్కరోజులోనే 36 వేలకి పెరిగిన అడ్వాన్స్ బుకింగ్స్!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

