ఇంట్లో అన్నిటినీ అందంగా అలంకరించుకోవాలనే కోరిక చాలామందికి ఉంటుంది. అసలే ఇప్పుడు కరోనా. బయటకెళ్లే పరిస్థితులు కూడా లేవు. కాలక్షేపానికి చిరునామా అయిన పుస్తకాలకు కాస్త భిన్నంగా, అందంగా వస్త్రంతో చేసిన కవర్లేయండి. ముందుగా టేపుతో పుస్తకం కొలతల్ని తీసుకోవాలి. పనికిరావని పక్కన పెట్టిన దుపట్టాలు, చీరల్లోంచి నచ్చిన ఆకారాల్లో కొలతకు సరిపోయేన్ని ముక్కలను కత్తిరించుకోవాలి. వాటన్నిటినీ పక్కపక్కనే చేర్చి సూదీ, దారంతో కలిపి కుట్టేయాలి. ఇప్పుడు ఫ్యాబ్రిక్ గ్లూని ఉపయోగించి రంగురంగుల్లో తయారైన అట్టని పుస్తకానికి చక్కగా అతికించాలి. అన్ని పుస్తకాలకు ఇలా చేసుకుంటే మీ బుక్‌షెల్ఫ్ రంగురంగుల ఫ్యాబ్రిక్‌తో కనువిందు చేయడం ఖాయం.