బాత్రూమ్ వెళ్తున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి !!
Bathroom Mistakes | టాయ్‌లెట్ ఫ్లష్ నొక్కేముందు మూతపెట్టాలి. ఎందుకంటే, ఫ్లష్ నుంచి వచ్చే తుంపర్లతో పాటు బ్యాక్టీరియా కూడా గాలిలో చేరుతుంది. తుంపర్లు దాదాపు ఆరు అడుగుల ఎత్తు వరకూ పడగలవు.
Bathroom Mistakes | ఎంత శుభ్రంగా ఉంచుకున్నా, బాత్రూమ్ రకరకాల క్రిములకు నిలయంగా మారుతుంది. మనం చేసే కొన్ని తప్పులూ దానికి తోడవుతాయి.
› టాయ్‌లెట్ ఫ్లష్ నొక్కేముందు మూతపెట్టాలి. ఎందుకంటే, ఫ్లష్ నుంచి వచ్చే తుంపర్లతో పాటు బ్యాక్టీరియా కూడా గాలిలో చేరుతుంది. ఈ తుంపర్లు దాదాపు ఆరు అడుగుల ఎత్తు వరకూ పడగలవు. చాలాసేపు గాల్లో ఉండగలవు.
› బాత్రూమ్లో టూత్‌బ్రష్ ఉంచడం ఏమంత మంచి అలవాటు కాదు. దీనివల్ల బ్రష్ త్వరగా పొడిబారదు. ఆ వాతావరణంలో హానికర బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది.
› ఒళ్లు రుద్దుకునేందుకు పీచు లేదా స్క్రబర్ని వాడతారు చాలామంది. అది కూడా నిత్యం బాత్రూమ్లోనే ఉంటుంది కాబట్టి, కనీసం రెండు వారాలకోసారి అయినా శుభ్రపరచాలి.
› టవళ్లను బాత్రూమ్లో ఆరేయకూడదు. పరిసరాల్లోని బ్యాక్టీరియా, వైరస్, ఈస్ట్ తడి టవల్ మీద ఆవాసం ఏర్పాటు చేసుకునే ప్రమాదం ఉంది. ఫలితంగా పాదాల ఇన్ఫెక్షన్, పులిపిర్లు, గోళ్ల సమస్యలు రావచ్చు.
› చాలా మంది ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉన్నా వేసుకోరు. ఇది మంచి అలవాటు కాదు. లోపలికి వెళ్లేప్పుడు ఎగ్జాస్ట్ ఫ్యాన్ వేయడం వల్ల చెడు వాసన కలిగించే బ్యాక్టీరియా బయటికి వెళ్లిపోతుంది. శుభ్రమైన పొడి వాతావరణం ఏర్పడుతుంది.
› బాత్రూమ్లో సెల్‌ఫోన్ వాడకం అనారోగ్యకరం. దీనివల్ల ఆ గదిలోని హానికర సూక్ష్మక్రిములు ఫోన్ ఉపరితలం మీద చేరతాయి. రకరకాల ఇన్ఫెక్షన్లను కలుగజేస్తాయి.
› షవర్ హెడ్‌ను కూడా ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూ ఉండాలి. లేకపోతే, ఆ రంధ్రాలు బ్యాక్టీరియా ఆవాసాలుగా మారతాయి. రెండు వారాలకోసారి అయినా షవర్‌హెడ్ శుభ్రం చేసుకోవాలి. కనీసం, షవర్ వాడటానికి ముందు ఒక నిమిషం పాటు వేడినీళ్లు ప్రవహించేలా చూడాలి. దానివల్ల కొంతమేర సూక్ష్మక్రిములు నశించే అవకాశం ఉంది. అనారోగ్యకర వాతావరణంలో స్నానం చేసినా చేయనట్టే.
Read More :
ఇంట్లో ఫ్రిజ్‌ను ఎలా పడితే అలా వాడేస్తున్నారా? ఈ జాగ్రత్తలు కచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే !!”
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- Bathroom
- Health
- Household tips
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramagundam Thermal Plant | రామగుండం ప్లాంట్‌పై పూటకో మాట.. రెండున్నరేళ్లుగా తేలని నిర్ణయం!
Cyberabad Police | పోలీసు గస్తీకి సుస్తీ.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దందాలు, సెటిల్ మెంట్లతో ఖాకీలు బిజీ!
Horoscope | 21-10-2026 బుధవారం.. మీ రాశి ఫలాలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

