చేనేత వస్ర్తాలకూ కలంకారీ కళకూ… చందమామకీ కలువ పువ్వుకీ ఉన్న సంబంధమే. మెత్తగా ఒంటికి హాయిగా ఉండే నేత వస్ర్తాల మీద చూడచక్కని రంగులను వికసింపజేస్తుంది కలంకారీ పనితనం. ఇక ఇప్పుడు పెన్ కలంకారీ జోరు నడుస్తున్నది.
సుందరంగా, సునిశితంగా ఉండే దీన్ని అతివలు అమితంగా ఇష్టపడుతున్నారు. ఆకుపచ్చని తివాచీ మీద అందమైన అల్లికలా కనిపిస్తున్న ఈ చీరపైనా పెన్ కలంకారీ రంగులే మెరుస్తున్నాయి. లేస్ అంచుతో ఉన్న ఈ వస్ర్తానికి అచ్చంగా చేత్తో ఆర్గానిక్ రంగులను అద్దారు. దీనికి రా సిల్క్ జాకెట్ను జతచేసి కట్టుకుని కళకే కళగా కనువిందు చేస్తున్నది యాంకర్ రష్మి.