ఆప్తుల సంఖ్య.. 150 ప్లస్!

మనిషి సంఘజీవి. ఒంటరిగా మనలేడు. ఇరుగు పొరుగు, బస్సులో తోటి ప్రయాణికులు, ఆఫీస్లో సహోద్యోగులు, కాలిబాటన పాదచారులు ఇలా వందలమందితో కలిసి జీవనం సాగిస్తుంటాడు. చుట్టూ ఎందరున్నా మనసు అందరినీ ఆదరించదు. ఎవరో కొందరినే తనవారని అనుకుంటుంది. అమ్మానాన్న, కుటుంబసభ్యులను నావాళ్లూ అనుకుంటుంది. బాల్య స్నేహితులు, టీనేజ్లో మిత్రులు, ఉద్యోగంలో సహచరులు.. వీరిలో అభిప్రాయాలు కలిసిన వారినే గుర్తుపెట్టుకుంటుంది. వారినే నేస్తాలుగా భావిస్తుంది. మనిషి జీవితంలో ఆప్తులనుకునే వారి సంఖ్య రమారమి 150 ఉంటుందని ఓ పరిశోధనలో తేలింది. ఈ స్టడీని నిర్వహించిన బ్రిటిష్ ఆంథ్రోపాలజిస్ట్ రాబిన్ డన్బర్ పేరుమీద అయినవారి సంఖ్యను ‘డన్బర్స్ నంబర్’గా ఫిక్స్ చేశారు. ఫేస్బుక్, ఇన్స్టా తదితర సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటున్న యువత సాంకేతిక స్నేహితులను ఇబ్బడిముబ్బడిగా పెంచుకుంటున్నది. అయితే మనసుకు దగ్గరైన వాళ్లనే నిజమైన ఆప్తులుగా గుర్తించాలన్నది డన్బర్ సూత్రం. ఆ ప్రకారంగా, ఆధునిక జీవితంలోనూ ఆయన ప్రతిపాదించిన సంఖ్యలో పెద్దగా మార్పు ఉండకపోవచ్చని నిపుణుల అభిప్రాయం.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

