కొందరిలో ముఖంపై మొటిమలు మరీ ఎక్కువగా కనిపిస్తాయి. ‘సిస్టిక్ ఆక్నే’గా పిలిచే ఈ మొటిమలు.. చర్మం పైపొరల కింద లోతుగా, గడ్డల రూపంలో ఏర్పడుతాయి. సాధారణ మొటిమల కంటే ఎక్కువ కాలం ఉంటాయి. అధికంగా మచ్చల్ని వదులుతాయి. వీటి విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి.
సిస్టిక్ ఆక్నే రావడానికి ప్రధాన కారణం.. హార్మోన్ల మార్పులు. ముఖ్యంగా యుక్తవయసులో, పీరియడ్స్ సమయంలో వచ్చే మార్పుల వల్ల ముఖంపై పెద్దపెద్ద మొటిమలు వస్తుంటాయి. కొందరిలో వంశపారంపర్యంగా కూడా ఈ సమస్య వస్తుంది. తల్లిదండ్రులకు సిస్టిక్ ఆక్నే ఉంటే.. పిల్లలకు వచ్చే అవకాశం ఉంటుంది.