Health Tips | అల్లంతో అలసటకు చెక్!
Health Tips | మనం రోజూవారి వంటల్లో వాడే పదార్థాల్లో ఒకటి అల్లం. కూరలు, గ్రేవీల్లోనే కాకుండా స్నాక్స్, చాట్లలోనూ మంచి ఘాటు రుచికి దీన్ని వాడతారు. ఇక వర్షాకాలంలో తరచూ పలకరించే జలుబు, గొంతునొప్పి వంటి సమస్యలకు అల్లం చాయ్, అల్లం పాలతో చెక్ పెట్టేయొచ్చు.
Health Tips | మనం రోజూవారి వంటల్లో వాడే పదార్థాల్లో ఒకటి అల్లం. కూరలు, గ్రేవీల్లోనే కాకుండా స్నాక్స్, చాట్లలోనూ మంచి ఘాటు రుచికి దీన్ని వాడతారు. ఇక వర్షాకాలంలో తరచూ పలకరించే జలుబు, గొంతునొప్పి వంటి సమస్యలకు అల్లం చాయ్, అల్లం పాలతో చెక్ పెట్టేయొచ్చు.
అల్లంలో మన శరీరానికి కావాల్సిన కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్, ప్రొటీన్స్ లభిస్తాయి. అయితే, అల్లాన్ని కూరల్లో భాగంగా తీసుకుంటే ఫలితం పరిమితంగానే ఉంటుందట. పరగడుపున చిన్న ముక్కలు తీసుకుంటే అధిక ప్రయోజనాలు ఉంటాయని నిపుణుల మాట.
ఉదయాన్నే ఒక టీ స్పూన్ అల్లం రసం తీసుకున్నా.. మంచి ఫలితం వస్తుందట. ఇలా చేస్తే రోజంతా హుషారుగా ఉంటారట. ఉదయాన్నే అర అంగుళం అల్లం ముక్కను, తేనెతో తీసుకుంటే.. జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగవుతుంది. ఫలితంగా గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం, కడుపు ఉబ్బరం తదితర సమస్యలు దూరమవుతాయి.
క్రమం తప్పకుండా అల్లం తీసుకోవడం వల్ల కీళ్లనొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. నోటి దుర్వాసన కూడా పారిపోతుంది. రోగనిరోధక శక్తి పెరగడంతోపాటు దగ్గు, జలుబు లాంటి సీజనల్ వ్యాధులు పీడించకుండా అల్లం అడ్డుగా నిలుస్తుంది.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

