కాఫీ చిందినా..స్టైలే!
ఇంటి అలంకరణలో ఇప్పుడు వినూత్నతకు పెద్దపీట వేస్తున్నారు. సాధారణ కార్పెట్లు, రగ్గుల స్థానంలో కళాత్మకంగా, సరదాగా కనిపించే డిజైన్లు ట్రెండ్‌గా మారుతున్నాయి. అలాంటి వాటిలో తాజాగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది కాఫీ స్పిల్ రగ్. చూడగానే నేలపై ఎవరో కాఫీ కప్పు ఒలకబోసినట్టే కనిపిస్తుంది ఇది.
ఇంటి అలంకరణలో ఇప్పుడు వినూత్నతకు పెద్దపీట వేస్తున్నారు. సాధారణ కార్పెట్లు, రగ్గుల స్థానంలో కళాత్మకంగా, సరదాగా కనిపించే డిజైన్లు ట్రెండ్‌గా మారుతున్నాయి. అలాంటి వాటిలో తాజాగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది కాఫీ స్పిల్ రగ్. చూడగానే నేలపై ఎవరో కాఫీ కప్పు ఒలకబోసినట్టే కనిపిస్తుంది ఇది. కాఫీ చిందిన ఆకారాన్ని అనుకరిస్తూ అవే రంగుల మిశ్రమంగా రూపొందిస్తున్నారు ఈ రగ్ని. పక్కనే తలకిందులైన కప్పు ఆకారాన్ని కూడా జోడించడం దీని ప్రత్యేకత. వాస్తవానికి ఇది ఒక అలంకరణ వస్తువే అయినప్పటికీ, గదిలోకి వచ్చిన వారిని క్షణం పాటు అయోమయానికి గురి చేస్తుంది. ఈ రగ్లు కేవలం సరదా కోసం మాత్రమే కాదు.

లివింగ్ రూమ్, కాఫీ కార్నర్, స్టడీ స్పేస్‌లకు ప్రత్యేక ఆకర్షణను తీసుకొస్తాయి. మినిమలిస్టిక్ ఇంటీరియర్‌లో ఇవి ఒక ఫోకల్ పాయింట్‌గా మారి గదికి జోష్ని జోడిస్తాయి. కాఫీ ప్రియులకు ఇది తెగ నచ్చేస్తున్నది. సోషల్ మీడియాలోనూ ఇలాంటి విచిత్ర డిజైన్లకు మంచి ఆదరణ లభిస్తున్నది. ఇంటి అలంకరణ అంటే ఖరీదైన వస్తువులే కావాలనేది పాత అభిప్రాయం. చిన్న సృజనాత్మక ఆలోచన కూడా కొత్త అందాన్ని తీసుకురాగలదని కాఫీ స్పిల్ రగ్ నిరూపిస్తున్నది. కప్పులు, కాఫీనే కాదు, దాని చిందర వందర అందాన్ని మాత్రం నేలపైనా ఆస్వాదించొచ్చని చెప్పే కొత్త ఇంటీరియర్ ట్రెండ్ ఇది!
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

