మనం ఇష్టంగా తినే జీడిపప్పుల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రొటీన్లు, పోషకాలు ఉంటాయని తెలిసిందే. ఆడవాళ్లలో అనేక అనారోగ్యాలకు కారణమయ్యే హార్మోన్ల అసమతౌల్యాన్ని కూడా ఇవి తగ్గిస్తాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. జీడిపప్పులో ఉండే అనకార్డిక్ యాసిడ్ అధిక ఈస్రోజెన్ స్థాయుల్ని నియంత్రిస్తుంది. ఈస్ట్రోజెన్ అనేది స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించిన ఒక కీలక హార్మోన్.
అయితే ఇటీవల జీవనశైలి కారణంగా దీని ఉత్పత్తి అధికం అవుతున్నది. ఫలితంగా పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్, బరువు పెరగడం, గర్భాశయంలో కణితులు ఏర్పడటం, నెలసరిలో హెచ్చుతగ్గులు, అధిక రక్తస్రావంలాంటి రకరకాల సమస్యలు తలెత్తుతున్నాయి. గుప్పెడు జీడిపప్పులో దాదాపు 20 మిల్లీ గ్రాముల అనకార్డిక్ ఆమ్లం ఉంటుంది. తరచూ వీటిని తినడం వల్ల హార్మోన్ల అసమతుల్యాన్ని తగ్గించుకోవచ్చన్నమాట!