కావలసిన పదార్థాలు
చియా గింజలు (సబ్జా): రెండు టీస్పూన్లు, పాలు: ఒక కప్పు, చక్కెర: రెండు టేబుల్ స్పూన్లు, డ్రైఫ్రూట్స్: ఒక టేబుల్ స్పూన్.
తయారీ విధానం
చియా గింజల్ని ఒక గంటపాటు పాలలో నానబెట్టాలి. స్టవ్‌మీద పాన్‌పెట్టి చక్కెర వేసి నీళ్లు పోయకుండా సన్నని మంటపై కలుపుతూ క్యారమెల్ తయారుచేయాలి. ఒక గ్లాస్ తీసుకుని రెండు మూడు పొరలలో చియా గింజల మిశ్రమం, క్యారమెల్ వేయాలి. పైనుంచి డ్రైఫ్రూట్స్ చల్లుకుంటే ఆరోగ్యకరమైన క్యారమెల్ చియా పుడ్డింగ్ సిద్ధం. ఇష్టపడే వాళ్లు పండ్ల ముక్కల్ని కూడా జతచేసుకోవచ్చు.