సియాచిన్ సుప్రీతం
ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన యుద్ధభూమి సియాచిన్. అక్కడ గడ్డకట్టే చలిలో పనిచేయాలంటే సుశిక్షితులే కాదు సుదృఢ దేహమూ ఉన్నవాళ్లు కావాలి. అందుకే మగవాళ్లే ఈ ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తుంటారు.
ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన యుద్ధభూమి సియాచిన్. అక్కడ గడ్డకట్టే చలిలో పనిచేయాలంటే సుశిక్షితులే కాదు సుదృఢ దేహమూ ఉన్నవాళ్లు కావాలి. అందుకే మగవాళ్లే ఈ ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తుంటారు. కానీ అదే రీతిలో రాటుదేలే శిక్షణ తీసుకుని అత్యంత ఎత్తులో రక్షణ విధులు నిర్వర్తించే ఎత్తుకు ఎదిగింది మైసూరుకు చెందిన కెప్టెన్ సుప్రీత. ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ విభాగం నుంచి ఇక్కడికి వెళ్తున్న తొట్టతొలి మహిళగా ఈమె రికార్డు సృష్టించింది.
మొదటి నుంచీ సాహసోపేతమైన ప్రాంతాల్లో పనిచేయాలన్నా, సవాళ్లతో కూడిన విధులు నిర్వర్తించాలన్నా సుప్రీతకు ఎంతో ఇష్టం. అందుకు తగ్గట్టుగానే పనితీరు చూపించేది. జమ్మూకశ్మీర్‌లోని అనంతనాగ్, హిమాలయ పర్వతాల దగ్గరి లేహ్లాంటి ప్రాంతాల్లోనూ పనిచేసింది. శరీరం గడ్డకట్టుకుపోయేలా మైనస్ డిగ్రీల్లో ఉష్ణోగ్రత ఉండే మంచు ప్రాంతం సియాచిన్ లో రక్షణ విధులు నిర్వర్తించాలని కలలు కంటుండేది. ఆమె ఆసక్తికి తగ్గట్టు అవకాశమూ వచ్చింది.
ఇంకేం, చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ(ఓటీఏ)లో కఠోర సాధన చేసింది. యూనిఫామ్ ధరించి దేశ రక్షణ కోసం సియాచిన్‌లో అడుగుపెడుతున్నది. ఇక తన వివాహం విషయంలోనూ ఇదే అభిరుచికి ప్రాధాన్యమిచ్చింది. ఆర్మీలోనే మేజర్‌గా పనిచేస్తున్న జెర్రీ బ్లేజ్‌ను గతేడాది వివాహమాడింది సుప్రీత. ఈ ఏడాది రిపబ్లిక్ డే పరేడ్‌లో ఇద్దరూ పాల్గొన్నారు. ఇలా పరేడ్‌లో మార్చ్ చేసిన తొలి జంటగానూ వీళ్లు చరిత్రకెక్కారు.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

