టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత!
తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ (టీపీఎస్) విషయంలో ఊహించిన ఉపద్రవమే ముంచు కొచ్చింది. రాష్ట్రంలోని 26 వేల స్కూళ్లను 4 వేలకు కుదిస్తామన్న సీఎం రేవంత్‌రెడ్డి మాటలు నిజమవుతున్నాయి. తెలంగాణ విద్యాకమిషన్ సిఫార్సులు అమలవుతున్నాయి.
- సమీపంలోని పాఠశాలల విలీనం
- ఒకే గొడుగు కిందికి నాలుగైదు స్కూళ్లు
- వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలు
- నర్సరీ నుంచి ఇంటర్ వరకు ఒకేచోట
- విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ (టీపీఎస్) విషయంలో ఊహించిన ఉపద్రవమే ముంచు కొచ్చింది. రాష్ట్రంలోని 26 వేల స్కూళ్లను 4 వేలకు కుదిస్తామన్న సీఎం రేవంత్‌రెడ్డి మాటలు నిజమవుతున్నాయి. తెలంగాణ విద్యాకమిషన్ సిఫార్సులు అమలవుతున్నాయి. సర్కార్ బడులను నిర్వీర్యం చేసేందుకు విద్యాశాఖ వేగంగా పావులు కదుపుతున్నది. ఉన్న స్కూళ్లను మూసి వేసేందుకు సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 134 తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను (క్యూర్ ఏరియాలోవి కలిపి) ప్రభుత్వం మంజూరు చేసింది. మరో నాలుగింటికి సంబంధించిన అనుమతులు రావాల్సి ఉన్నది. 2027-28 విద్యాసంవత్సరంలో వీటిని ప్రారంభించాలని పాఠశాల విద్యాశాఖ స్పష్టంచేసింది.
అంతేకాదు.. టీపీఎస్‌లకు సమీపంలోని ఇతర స్కూళ్లను విలీనం చేయాలని ఆదేశించింది. మండల పరిషత్, జిల్లా పరిషత్ స్కూళ్లు, మాడల్ స్కూళ్లు, కేజీబీవీలు, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూళ్లు, జూనియర్ కాలేజీలను ఒకే గొడుగు కిందికి తీసుకు రావాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ స్పష్టంచేశారు. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ఒకే ప్రాంగణంలో విద్యనందించేం దుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. విలీనం ఉండబోదని గతంలో చెప్పినా, తాజాగా ఉత్తర్వులతో స్కూళ్ల మూసివేత కోసమే ప్రభుత్వం టీపీఎస్‌లను తెరపైకి తెచ్చిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
చిన్న స్కూళ్ల నిర్వీర్యం
కాంగ్రెస్ ప్రభుత్వం విరివిగా టీపీఎస్‌లను నెలకొల్పుతున్నది. రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో తొలి పాఠశాలను ఏర్పాటు చేశారు. పొల్కంపల్లి, వంగూరు, మంచాలలో మరో మూడు స్కూళ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. ఇవేకాకుండా 80 వరకు స్కూళ్లల్లో నిర్మాణ పనులు నడుస్తున్నా యి. ఇటీవలే మరికొన్ని మంజూరయ్యాయి. ఇవన్నీ కూడా సమీపంలోని స్కూళ్లను విలీనం చేయడంతో ఆవిర్భవించేవే కావడం గమనార్హం. ఫలితంగా నాలుగైదు స్కూళ్లు ఒకే స్కూల్‌గా మారుతాయన్నమాట. టీపీఎస్‌లను ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు నడుపనున్నారు. ఒక్కో టీపీఎస్‌ను రూ.10-12కోట్లు వెచ్చించి ఏర్పాటు చేస్తున్నారు.
ఏడాదిలో ఒక టీపీఎస్ నిర్వహణకు రూ.1.5 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఇందులో 1,500 మంది విద్యార్థులుంటారు. ఇందుకోసం సమీపంలోని గ్రామాల నుంచి బస్సులు పెట్టి విద్యార్థులను తరలించనున్నారు. దీంతో సమీపంలోని చిన్న స్కూళ్లు రానురాను నిర్వీర్యం కానున్నాయి. చుట్టుపక్కల గ్రామాల్లోని చిన్న స్కూళ్లలో ఉన్న వారంతా టీపీఎస్‌ల బాట పడితే, అవి మూతపడటం ఖాయమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా 10-20 మంది విద్యార్థులతో నడిచే స్కూళ్లన్నీ అంపశయ్యమీదికి చేరినట్టేనని చెప్తున్నారు. ఇలా టీపీఎస్ ప్రయోగం చిన్న స్కూళ్ల పాలిట మరణశాసనం కానున్నదని ఉపాధ్యాయ సంఘాల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి.
భారంగా మారనున్న నిర్వహణ
ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాల్సిందిపోయి పాఠశాలల విలీనానికి శ్రీకారం చుట్టడం, మూసివేతకు పరోక్షంగా దారులు తెరువడంపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. అంతేకాదు.. టీపీఎస్లతో స్కూళ్లు తమ ప్రత్యేకతలను కోల్పోయే ప్రమాదం పొంచి ఉన్నది. వేర్వేరు లక్ష్యాలు, ప్రత్యేక వ్యవస్థలు గల సోషల్ వెల్ఫేర్ గురుకులాలు, మాడల్ స్కూళ్లు వంటివి తాజా విలీనంలో మాయమవుతాయి. స్కూళ్లల్లో నిర్వహణ లోపాలు తలెత్తే ప్రమాదమున్నది. ఒకే ప్రాంగణంలో నర్సరీ నుంచి ఇంటర్ వరకు భారీ క్యాంపస్‌లో నిర్వహించడంతో భారమవుతుంది. పర్యవేక్షణ లోపాలు, క్రమశిక్షణారాహిత్యం వంటివి తలెత్తుతాయని నిపుణులు పేర్కొంటున్నారు. నర్సరీ చదివే చిన్నారు లు రోజుకు కిలోమీటర్ల తరబడి ప్రయాణం చేయాల్సి రావడం ఇబ్బందికరమని, ఇది విద్యను దూరం చేస్తుందని హెచ్చరిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

